ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు | |
---|---|
దర్శకత్వం | కొంగరపి వెంకటరమణ |
రచన | మరుధూరి రాజా (మాటలు) |
స్క్రీన్ ప్లే | కొంగరపి వెంకటరమణ |
కథ | కొంగరపి వెంకటరమణ |
నిర్మాత | దమ్మలపాటి శ్రీనివాసరావు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ రాశి గుర్లిన్ చోప్రా |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | సాయి కృష్ణ ప్రొడక్షన్స్[1] |
విడుదల తేదీs | 28 మే, 2004 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు, 2004 మే 28న విడుదలైన తెలుగు కామెడీ సినిమా.[2] సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానరులో[3] దమ్మలపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి కొంగరపి వెంకటరమణ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రాశి, గుర్లిన్ చోప్రా నటించగా,[4] వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[5]
కథా నేపథ్యం
[మార్చు]హరిశ్చంద్ర (రాజేంద్ర ప్రసాద్) చాలా నమ్మకమైన, నిజాయితీగల మధ్యతరగతి వ్యక్తి. కానీ అతని భార్య సత్య (రాశి) తనను తాను ధనవంతురాలిగా ఊహించుకుంటుంది. వారికి ఒక కొడుకు. సత్య సోదరుడు శరత్ (సూర్య) ఒకసారి ఇంటికి వచ్చి, ఒక అమ్మాయికి జన్మనిస్తే ఆ దంపతులకు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తాడు. సత్య ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఆడపిల్ల పుట్టడానికి ఆశీర్వాదం కోరుతుంది; ప్రతిఒక్కరికీ అబద్ధాలు చెప్పే ప్రతిజ్ఞను ప్రారంభించాలని అతను ఆమెకు సలహా ఇస్తాడు. మొదట్లో హరి దానికి అంగీకరించడు, కాని సత్య ఆత్మహత్యకు ప్రయత్నించగా అతను కూడా ప్రతిజ్ఞకు అంగీకరిస్తాడు. హరి తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ (కృష్ణ భగవాన్) ను కలిసినపుడు, ప్రతిజ్ఞ కారణంగా తాను వివాహం చేసుకోలేదని అబద్ధం చెప్తాడు. దాంతో, కృష్ణ తన సోదరి మీనా (గుర్లిన్ చోప్రా) వివాహం హరితో ఏర్పాటు చేసుకుంటాడు. మీనా తండ్రి చివరి దశలో ఉన్నందున, హరి అనుకోకుండా మీనాను వివాహం చేసుకోవలసి వస్తుంది. మీనాను ఇంటికి తీసుకువచ్చి సత్యను పనిమనిషిగా పరిచయం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్ (హరిశ్చంద్ర)
- రాశి (సత్య)
- గుర్లిన్ చోప్రా (మీనా)
- బ్రహ్మానందం
- సునీల్
- తనికెళ్ళ భరణి (సూర్యారాయుడు)
- వేణుమాధవ్
- కృష్ణ భగవాన్ (కృష్ణ)
- సూర్య (శరత్)
- రమాప్రభ
- జయలలిత
- జూనియర్ రేలంగి
- జీవా
- జెన్నీ
- రాధిక చౌదరి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నీ వయసు తక్కువ (రచన: పైడిశీటి రామ్)" | పైడిశీటి రామ్ | ఉదిత్ నారాయణ్, కౌసల్య | 4:40 |
2. | "గోవిందా గోవిందా (రచన: తైదలబాపు)" | తైదలబాపు | హరిహరన్, కౌసల్య | 4:45 |
3. | "ఇరువురి భార్యల (రచన: జయసూర్య)" | జయసూర్య | హరిహరన్, ఉష | 4:40 |
4. | "అడదానికి ఆస్తులంటే (రచన: తైదలబాపు)" | తైదలబాపు | రవివర్మ | 4:37 |
5. | "నా ట్రంకు పెట్టె (రచన: పైడిశీటి రామ్)" | పైడిశీటి రామ్ | మాలతి | 4:06 |
మొత్తం నిడివి: | 22:48 |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu cinema Review - Oka Pellam Muddu Rendo Pellam Vaddu". www.idlebrain.com. Retrieved 2021-03-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Movie Review". IndiaGlitz.com. Retrieved 2021-03-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ WoodsDeck. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Telugu Movie Reviews". WoodsDeck. Archived from the original on 2017-05-10. Retrieved 2021-03-18.
- ↑ "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Review". fullhyderabad. Retrieved 2021-03-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Oka Pellam Muddu Rendo Pellam Vaddu (2004)". FilmiBeat. Retrieved 2021-03-18.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Oka Pellam Muddu Rendo Pellam Vaddu (Songs)". Cineradham. Retrieved 2021-03-18.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2004 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- రాశి (నటి) నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు