గుర్లిన్ చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్లిన్ చోప్రా
గుర్లిన్ చోప్రా (ముంబై)
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమా నటి, మోడల్.
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
ఎత్తు1.70 m (5 ft 7 in)
తల్లిదండ్రులుహర్జిత్ సింగ్ చోప్రా
అనూప్ చోప్రా

గుర్లిన్ చోప్రా,[1] భారతీయ సినిమా నటి, మోడల్. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ,[2] కన్నడ, పంజాబీ సినిమాలలో నటించింది.[3]

జననం

[మార్చు]

హర్జిత్ సింగ్ చోప్రా, అనూప్ చోప్రా దంపతులకు చండీగఢ్ లో గుర్లిన్ చోప్రా జన్మించింది.

మోడలింగ్

[మార్చు]

చిన్న వయసులోనే గుర్లీన్ చోప్రా "మిస్ చండీగఢ్"గా ఎంపికైంది. తన స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు మొదట్లో ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు.[4]

సినిమారంగం

[మార్చు]

1993లో సుర్జిత్ బింద్రాఖియా 'టెడి టెడి తక్డి తు' పాటలో మోడల్‌గా గుర్లీన్ చోప్రా అరంగేట్రం చేసి, ఇండియన్ బాబు అనే హిందీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5] తరువాత కుచ్ తో గడ్బాద్ హై సినిమాలో రియా అనే అనాథ అమ్మాయిగా నటించింది.[6] 2003లో వచ్చిన ఆయుధం[7] సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. మన్మత సినిమాలో డబుల్ రోల్ చేసింది. ఈ సినిమాలో ఆమె నటన గురించి,"లక్ష్మి వంటి బ్లైండ్ పాత్రలో లో గుర్లిన్ చోప్రా అకట్టుకుంది" అని సిఫీ రాసింది.[8] "ఆమె రెండు పాత్రల్లో చక్కగా నటించింది" అని రీడిఫ్ రాసింది.[9] 2004లో తన మొదటి తమిళ సినిమా తుల్లాల్‌పై[10][11] లో నటించగా, అది 2007లో విడుదలైంది. ఆ తర్వాత పంజాబీ సినిమారంగంలోకి వెళ్ళి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. హషర్ సినిమాలో, బాబ్బు సరసన నటించింది. 2009లో తెలుగులో కోనసీమలో చిట్టేమ్మ కిట్టయ్య[12] సినిమాలో, వాస్తవం అనే 3డి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించింది.[13] 2015లో మరాఠీ తొలి చిత్రం షిన్మా సినిమాలో నటించింది.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2003 ఇండియన్ బాబు దిల్ హిందీ
2003 ఆయుధం శ్రావణి తెలుగు
2004 ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు మీనా తెలుగు
2004 నేను సైతం తెలుగు
2004 సర్దారా ప్రియా కన్నడ
2004 కుచ్ తో గద్బాద్ హై రియా సింగ్ హిందీ
2005 విష్ణు సేన కన్నడ
2005 కాకి ఫరా తెలుగు
2006 బాగి ప్రీత్ పంజాబీ
2006 పాండవరు అంజలి కన్నడ
2006 భాగం భాగ్ నిషా చౌహాన్ హిందీ
2007 మన్మత లక్ష్మి / ప్రియా కన్నడ
2007 తుల్లాల్ శ్రుతిక తమిళం
2008 హషర్: ఎ లవ్ స్టోరీ షగన్ పంజాబీ
2010 కబడ్డీ ఇక్ మొహబ్బత్ రౌనాక్ గిల్ పంజాబీ
2010 నానే ఎన్నూల్ ఇల్లాయ్ తమిళం
2012 అజ్జ్ డి రంజే క్రాంతి పంజాబీ
2012 సిర్ఫైర్ పంజాబీ
2014 పాండవులు పాండవులు తుమ్మెద తెలుగు
2014 కిర్పాన్: ది స్వోర్డ్ ఆఫ్ ఆనర్ జాస్మిన్ పంజాబీ
2014 శివ కేశవ్ తెలుగు
2014 ఆ గయే ముండే యుకె డి డాలీ పంజాబీ
2015 షిన్మా మరాఠీ
2015 ఇంటర్నేషనల్ హీరో హిందీ
2017 యాష్లే యాష్లే హిందీ
2017 గేమ్ ఓవర్ [14] సనయ హిందీ
2019 జై ఛతి మా హిందీ
2020 1840 హైదరాబాద్ సిమ్రాన్ హిందీ

మూలాలు

[మార్చు]
 1. "Actress Gurleen Chopra changes her name to Gurlen Siingh Chopraa - Times of India". The Times of India. Retrieved 2021-03-19.
 2. 2.0 2.1 "Archived copy". Archived from the original on 25 July 2015. Retrieved 2021-03-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 3. Features, Express. "An interesting love story". The New Indian Express. Archived from the original on 2014-03-03. Retrieved 2021-03-19.
 4. "Recreating a musical magic". The Hindu. 2002-12-25. Archived from the original on 2014-02-23. Retrieved 2021-03-19.
 5. "The Tribune, Chandigarh, India - The Tribune Lifestyle". Tribuneindia.com. Retrieved 2021-03-19.
 6. "Interview with Gurleen Chopra - GURLEEN CHOPRA'S NO FOR BODY EXPOSURE - Bollywood Article". Smashits.com. 2004-05-06. Archived from the original on 21 February 2014. Retrieved 2021-03-19.
 7. "Tacky script sinks Ayudham". Specials.rediff.com. 2003-06-07. Retrieved 2021-03-19.
 8. "Movie Review : Manmatha". Sify.com. Archived from the original on 2014-04-07. Retrieved 2021-03-19.
 9. "Manmatha: Watch it for Jaggesh, Komal - Rediff.com Movies". Rediff.com. 2007-08-06. Retrieved 2021-03-19.
 10. "Another director-actor!". The Hindu. 2004-07-29. Archived from the original on 2004-09-24. Retrieved 2021-03-19.
 11. "Meaty role for the heroine". The Hindu. 2004-09-03. Archived from the original on 2004-10-01. Retrieved 2021-03-19.
 12. TNN (2009-01-09). "Gurleen Chopra is back - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2014-02-12. Retrieved 2021-03-19.
 13. "3D films are huge crowd-pullers says, Telugu producer Srinivasa Reddy". Ibnlive.in.com. 2013-02-22. Archived from the original on 2014-02-22. Retrieved 2021-03-19.
 14. https://in.bookmyshow.com/kheda/movies/game-over/ET00062177

బయటి లింకులు

[మార్చు]