Jump to content

రాధిక చౌదరి

వికీపీడియా నుండి
రాధిక చౌదరి
జననం (1984-10-20) 1984 అక్టోబరు 20 (వయసు: 41)
వృత్తినటి, దర్శకురాలు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1999 – ప్రస్తుతం

రాధికా చౌదరి (జననం 1984 అక్టోబరు 20) భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు చలనచిత్రాలలో 2000ల ప్రారంభంలో నటించింది. 2010లో, లాస్ వెగాస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకుని, ఆమె అమెరికాలో చిత్ర దర్శకురాలిగా సినీప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టింది.

కెరీర్

[మార్చు]

1999 నుంచి పలు దక్షిణాది చిత్రాలలో నటిస్తూనే కల్ట్ 11 (2010), అవుట్‌సోర్సింగ్ (2011) వంటి టీవీ ధారావాహికలలోనూ చేసింది. 2010లో, ఆమె లాస్ ఏంజిల్స్‌లో దర్శకురాలిగా మారింది. లాస్ వెగాస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్ ఆరెంజ్ బ్లోసమ్ చిత్రం ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా సిల్వర్ ఏస్ అవార్డును గెలుచుకుంది.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాత్ర నోట్స్
1999 సాంబయ్య తెలుగు
కన్నుపడ పోగుత్తయ్య తమిళం
టైం తమిళం తెలుగులో టైం
2000 సిమ్మాసనం తమిళం
క్రోధం 2 తమిళం
ప్రియమానవాలే తమిళం సౌమ్య
2001 హుచ్చన మదువేలి ఉందొనే జానా కన్నడ
మిడిల్ క్లాస్ మాధవన్ తమిళం
లేడీస్ అండ్ జెంటిల్‌మన్ తమిళం
కుంగుమ పొట్టు గౌండర్ తమిళం
నువ్వు నేను తెలుగు ప్రియా
పార్థలే పరవాసం తమిళం రేఖ తెలుగులో పరవశం
2002 షక్కలక్క బేబీ తమిళం
తప్పు చేసి పప్పు కూడు తెలుగు చీచ
నంది కన్నడ పింకి
2003 ఖుషీ హిందీ రోమా
వికడన్ తమిళం
తేరే నామ్ మూగ బిచ్చగాడు చిన్న దృశ్యం
మా అల్లుడు వెరీ గుడ్ తెలుగు ప్రత్యేక ప్రదర్శన
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు తెలుగు
ఐతే ఏంటి తెలుగు
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు తెలుగు
2004 శీను వాసంతి లక్ష్మి తెలుగు
ఎన్ పురుష్ ఎతిర్ వీటు పొన్ను తమిళం పార్వతి
2010 ది హంచ్‌బ్యాక్ ఆంగ్ల
2022 లాల్ సింగ్ చద్దా హిందీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా

మూలాలు

[మార్చు]
  1. "Radhika Chaudhari wins Silver Ace at LA fest - Times of India". articles.timesofindia.indiatimes.com. Retrieved 3 February 2022.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)