పరవశం
పరవశం (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
కథ | కె.బాలచందర్ |
సంగీతం | ఎ.ఆర్.రహమాన్ |
కూర్పు | సురేష్ అర్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్యమూవీస్ |
భాష | తెలుగు |
పరవశం 2001లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళ సినిమా పార్థలే పరవశం దీనికి మాతృక. ఇది కె.బాలచందర్ తీసిన 100వ సినిమా.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ: కె.బాలచందర్
- స్క్రీన్ ప్లే: కె.బాలచందర్
- దర్శకత్వం: కె.బాలచందర్
- మాటలు: శ్రీరామకృష్ణ
- పాటలు: ఎ.ఎం.రత్నం, శివగణేష్
- నిర్మాత: ఎ.ఎం.రత్నం
కథ
[మార్చు]మాధవ్ (మాధవన్) వృత్తిరీత్యా డాక్టర్, సినిమా స్టార్. అమ్మాయిలు ఇతని వెనక పడుతున్నా, ఇతడు సినిమాలలో నటించడానికంటే మరణించిన తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్‌గా రోగులకు సేవలు చేయడానికే ఇష్టపడుతుంటాడు. షీలా (స్నేహ) మాధవ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ వుంటుంది.
ఆనందం (లారెన్స్) సిటీలో పేరుమోసిన డ్యాన్సర్. సిమి (సిమ్రాన్) ఆనందం ఆట చూడటానికి మోసం చేస్తుంది. ఆనందం సిమిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు.
మాధవ్‌కు పెళ్ళి చేసుకొమ్మని అమ్మాయిల పోరు ఎక్కువ అవుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి తల్లి కుదిర్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి మాధవ్ సిద్ధపడతాడు. ఆమె సిమిని మాధవ్‌కు జోడీగా ఎన్నుకుంటుంది. మాధవ్, సిమి పెళ్ళి చేసుకుని హాయిగా ఉంటారు. ఇంతలో లండన్ నుండి డాక్టర్ రేఖ (రాధికా చౌదరి) తన సంతానంతో సహా దిగుతుంది. మాధవ్ ఇంట్లో లేనప్పుడు రేఖ వచ్చి తనకు మాధవ్‌కు శారీరక సంబంధం ఉన్నట్లు, ఫలితంగా కొడుకు పుట్టినట్లు చెబుతుంది. మాధవ్ ఇంట్లో చిచ్చుపెట్టి రేఖ లండన్ వెళ్లిపోతుంది. మాధవ్ తనకు రేఖకు కాలేజీ రోజులలో సంబంధం ఉన్నట్లు అంగీకరిస్తాడు. దానితో సిమి మాధవ్‌కు విడాకులు ఇస్తుంది.
తరువాత సిమి ఆనందంకు, షీలా మాధవ్‌కు దగ్గరౌతారు. పరిస్థితుల ప్రభావం వల్ల సిమి - ఆనందం, షీలా - మాధవ్‌లు ఒకే కళ్యాణమండపంలో పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఈ అసాధారణ వివాహం జరుగుతుందా? మళ్లీ సిమి మాధవ్‌లు ఒకటౌతారా? అనేది సినిమా చివరి సన్నివేశంలో తెలుస్తుంది[1].
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నీవే నా జాతీయ గీతం" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | పి.బలరాం, చిత్ర | |
2. | "మన్మథ మాసం ఇది మన్మథమాసం" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | శంకర్ మహదేవన్, నిత్యశ్రీ | |
3. | "పరవశం పరవశం పరవశం వశం వశం" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | రెహనా, గంగ, ఫెబి, ఫెజి, పూర్ణిమ | |
4. | "చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్‌గమ్ | |
5. | "అతిశయ పరిణయం ఆనంద పరిణయం" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | కళ్యాణి, సుజాత, శ్రీరామ్‌నారాయణ, శ్రీరామ్‌పార్థసారథి | |
6. | "నాదిరి దిన్నాన నాదిరి దినా" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | శంకర్ మహదేవన్, ఎస్.పి.శైలజ | |
7. | "అరె అక్షరాలు రెండైన చెడ్డమాట శిష్య ఏవిటో" | ఎ.ఎం.రత్నం, శివగణేష్ | ఎ.ఆర్.రహమాన్ | హరిణి, కార్తీక్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "PARAVASAM (2001)". The Cine Bay. Archived from the original on 31 అక్టోబరు 2020. Retrieved 3 April 2018.
- ↑ సంపాదకుడు (1 December 2001). "పరవశం పాటల పుస్తకం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (5): సెంటర్ స్ప్రెడ్. Retrieved 3 April 2018.