Jump to content

రాఘవ లారెన్స్

వికీపీడియా నుండి
రాఘవ లారెన్స్
జననం (1976-10-29) 1976 అక్టోబరు 29 (వయసు 48)
చెన్నై
వృత్తినటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు, సంగీత దర్శకుడు, దాత
క్రియాశీల సంవత్సరాలునృత్య దర్శకుడు (1993 – ప్రస్తుతం)
నటుడు (1998 – ప్రస్తుతం)
దర్శకుడు(2004 – ప్రస్తుతం)

రాఘవ లారెన్స్ (జననం: 1976 అక్టోబరు 29)[1] ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు. 1993 లో నృత్యదర్శకుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. తరువాత నటుడిగా అవకాశాలు వెతుక్కున్నాడు. 1998 లో మొదటి సారిగా ఓ తెలుగు సినిమాలో నటించాడు. 2001 లో లారెన్స్ ను తన పేరులో చేర్చుకుని తమిళంలో ప్రముఖ నటులతో కలిసి పనిచేశాడు. 2006 లో తెలుగులో వచ్చిన స్టైల్ అనే సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించాడు. నృత్య దర్శకుడిగా 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు సాధించాడు. 2015 లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు.[2][3]

కెరీర్

[మార్చు]

లారెన్స్ తమిళం మాట్లాడే క్రిస్టియన్ పరైయర్ కుటుంబంలో మురుగైయన్, కన్మణిలో జన్మించాడు. లారెన్స్‌కు చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది.[4][5][6] అతను తన కణితిని దేవుడైన రాఘవేంద్ర స్వామికి ఆపాదించాడు,[7], భక్తితో, అతను హిందూమతంలోకి మారాడు, రాఘవ అనే పేరు తీసుకున్నాడు [5] అతను ఆవడి - అంబత్తూరులోని తిరుముల్లైవాయల్ వద్ద రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని నిర్మించాడు. మార్గం, 2010 జనవరి 1న ప్రారంభించబడింది [8] రాఘవకు ఎల్విన్ లారెన్స్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

లారెన్స్ మొదట తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ కి కార్ క్లీనర్ గా పనిచేసేవారు.[5] డాన్సుల్లో ఇతడి ప్రతిభ గుర్తించిన రజినీకాంత్ డాన్సర్స్ యూనియన్ లో చేరటానికి సహాయం చేసారు.[5][9] ఆ తరువాత చిరంజీవి తన సినిమా హిట్లర్ లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. తన పనితనానికి మెచ్చిన చిరంజీవి, రాబోయే సినిమా మాస్టర్ కి కూడా అవకాశం ఇచ్చారు.[5]

లారెన్స్ మొదటగా 1991 లో వచ్చిన దొంగా పోలీస్ సినిమాలో ఒక పాటలో ప్రభుదేవాతో పాటు కనిపించారు. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్ మన్ సినిమాలో చికుబుకు చికుబుకు రైలే పాటలో ప్రభుదేవా వెనకాల ఉన్న డాన్సర్స్ లో ఒకరుగా కనిపించారు. దీనితో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లో పాటల్లో కూడా కనిపించారు.[5] నిర్మాత టీ.వీ.డీ.ప్రసాద్ లారెన్స్ కు స్పీడ్ డాన్సర్ అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు, కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.[5] ఆ తరువాత మరో రెండు సినిమాల్లో కూడా హీరోగా నటించారు కానీ అవి కూడా విజయం సాధించలేదు.[4] ఆ తరువాత దర్శకుడు కె.బాలచందర్ తన 100వ సినిమా పార్థాలే పరవశంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.[4][9] ఆ తరువాత హారర్ ముని చిత్ర సిరీస్ తో దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ముని- 4 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.[10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

తెలుగు

[మార్చు]
ఎడాది చిత్రం భాష గమనికలు
2004 మాస్ తెలుగు
2006 స్టైల్ తెలుగు
2007 ముని తెలుగు/తమిళం
2007 డాన్ తెలుగు సంగీత దర్శకుడు కూడా
2011 ముని 2: కాంచన తెలుగు/తమిళం
2012 రెబెల్ తెలుగు సంగీత దర్శకుడు కూడా
2015 ముని 3: గంగ తెలుగు/తమిళం

నృత్యం

[మార్చు]
చిత్రం పాట ఎడాది భాష గమనికలు
జంటిల్ మన్ "చికుబుకు చికుబుకు రైలే" 1993 తెలుగు/తమిళం
అజయ్ప్పలి "అజయ్ప్పలి ఇల్లాత" 1993 తమిళం
ముఠామేస్త్రి "ఈ పేటకు నెనె మేస్త్రి" 1993 తెలుగు
చిన్న మేడమ్ 1994 తమిళం
అమర్కలం "మహా గణపతి" 1999 తెలుగు
ఉన్నాయ్ కోడు ఎన్నై తరువేన్ "సొల్లు తలైవా" 2000 తమిళం
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి "లవ్వుకి ఏజీ" 2000 తెలుగు
చాలా బాగుంది "ఎంతబాగుంది బాసు" 2000 తెలుగు
తిరునెల్వేలి "యెలె అళగమ్మ" 2000 తమిళం
అసుర "మహా గణపతి" 2001 కన్నడ
వరుషమెల్లం వసంతం "నాన్ రెడీ నీంగా రెడీయా" 2002 తమిళం
రోజా కూటం "సుబ్బమ్మ" 2002 తమిళం
బాబా "మాయ మాయ" 2002 తెలుగు/తమిళం
నిన్నే ఇష్టపడ్డాను "కృష్ణ జిల్లా" 2003 తెలుగు
సత్యం "కుచ్ కుచ్" 2003 తెలుగు
తిరుమలై "తాంతక్క థీమ్తక్క" 2003 తమిళం
మాస్ "మాస్" 2004 తెలుగు
పెన్ సింగం "అది ఆది అసైయుమ్ ఏడుపు" 2010 తమిళం
కథై తిరైకథై వాసనం ఇయక్కం "లైవ్ ది మూమెంట్" 2015 తమిళం

నటుడు

[మార్చు]
ఎడాది చిత్రం భాష పాత్ర గమనికలు
స్పీడ్ డాన్సర్ 1999 తెలుగు
పార్థేన్ రాజితేణ్ 2000 తమిళం దాస్
పార్దాలే పరవశం 2001 తమిళం అళగు
అర్పుధాం 2002 తమిళం అశొక్ కుమార్
స్టైల్ (2002) 2002 తమిళం రిశాంత్
తెండ్రాళ్ 2004 తమిళం కుమార్
స్టైల్ 2006 తెలుగు రాఘవ
ముని 2007 తెలుగు/తమిళం
డాన్ 2007 తెలుగు రాఘవ
పాండి 2008 తమిళం పాండి
రాజాధిరాజా 2009 తెలుగు/తమిళం రాజా
ఇరుంబుక్కోట్టై మురత్తు సింగం 2010 తమిళం సింగం/సింగారం
ముని 2: కాంచన 2 2011 తెలుగు/తమిళం రాఘవ
ముని 3: గంగ 2015 తెలుగు/తమిళం రాఘవ, శివ
ముని 4 2017 తెలుగు/తమిళం శివ పోస్ట్ ప్రొడక్షన్
శివలింగ 2017 తమిళం

పురస్కారాలు

[మార్చు]


ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – అన్నయ్య – తెలుగు (2000)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – పార్థాలే పరవశం – తమిళం (2001)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – ఇంద్ర – తెలుగు (2002)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – స్టైల్ – తెలుగు (2006)
నంది పురస్కారాలు
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – అన్నయ్య – (2000)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – ఇంద్ర – (2002)
  • ఉత్తమ నృత్య దర్శకత్వం – స్టైల్ – (2006)
ఎడిసన్ అవార్డ్స్
  • మణిధ నేయం అవార్డు – (2015)
  • అసాధారణ ప్రదర్శన (Male) – ముని 3 : గంగ (2015)

సా‌‌‌‌మాజిక సేవ

[మార్చు]

లారెన్స్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు గుండె చికిత్స తన ఫౌండేషన్ తరపున చేయించారు, ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కలిపించారు.[11][12][13]

మూలాలు

[మార్చు]
  1. "పుట్టిన తేదీ".
  2. "Lawrence donates 1cr". Archived from the original on 2015-12-08. Retrieved 2016-09-01.
  3. "Raghava Lawrence launches Abdul Kalam Trust, donates Rs 1 cr". Archived from the original on 2015-09-06. Retrieved 2016-09-01.
  4. 4.0 4.1 4.2 "Raghava Lawrence – Telugu Cinema interview – Telugu film director". Idlebrain.com. 16 January 2006. Retrieved 26 August 2013.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "Rediff on the Net, Movies: India rubber". Rediff.com. 25 April 1998. Retrieved 26 August 2013.
  6. "பதினாறு வயசுல மறுபிறவி!" (PDF). Kalki (in తమిళము). 30 September 2001. pp. 56–59. Retrieved 3 August 2023.
  7. TeluguCinema.Com – TC Exclusive: Interview with choreographer-director Lawrence. Telugucinema.com. 11 February 2005
  8. "Rajini's spiritual suggestion". The New Indian Express. Archived from the original on 21 మార్చి 2015. Retrieved 26 August 2013.
  9. 9.0 9.1 "Metro Plus Kochi / Music : My First Break – Raghava Lawrence". The Hindu. 8 November 2008. Archived from the original on 26 ఆగస్టు 2013. Retrieved 26 August 2013.
  10. Andhrajyothy (18 June 2021). "తెరవెనుక నుంచి తెరపైకి". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  11. "Raghava Lawrence helped a child in heart surgery". Archived from the original on 2016-04-06. Retrieved 2016-10-31.
  12. "Page 1 of Raghava Lawrence Helped 128th Heart Surgery , Raghava Lawrence Helped 128th Heart Surgery Photos".
  13. "Raghava Lawrence helped a child in heart surgery, 128th heart surgery done by Raghava Lawrence - Serials online SunTv VijayTv Polimer RajTv News". 15 March 2016. Archived from the original on 29 March 2017. Retrieved 31 October 2016.