రక్షణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్షణ
(1993 తెలుగు సినిమా)
Rakshana telugu.jpg
దర్శకత్వం ఉప్పలపాటి నారాయణరావు
నిర్మాణం అక్కినేణి వెంకట్
కథ ఉప్పలపాటి నారాయణరావు
అక్కినేణి వెంకట్
చిత్రానువాదం ఉప్పలపాటి నారాయణరావు
అక్కినేని వెంకట్
తారాగణం అక్కినేని నాగార్జున ,
శోభన
సంగీతం ఎం.ఎం.కీరవాణి
సంభాషణలు పోసాని కృష్ణ మురళి
ఛాయాగ్రహణం తేజ
కూర్పు శంకర్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

రక్షణ పోలీసు నేపథ్యం ఆధారంగా 1993 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో అక్కినేని వెంకట్ నిర్మించి, ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో అక్కినేని నాగార్జున, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.

కథ[మార్చు]

విశాఖపట్నంలో ఎసిపిగా పనిచేస్తున్న బోస్ ( అక్కినేని నాగార్జున ) హైదరాబాద్ వస్తాడు. అతను తన స్నేహితుడు ( నాసర్ ) తో కలిసి ఉంటాడు. తన ధర్మబద్ధమైన కానీ ఆవేశపూరిత చర్యలకు ప్రసిద్ధి. అతని స్నేహితుడు దాని గురించి ఆందోళన చెందుతాడు. అండర్వరల్డ్ డాన్ సోదరులైన చిన్నా ( సలీం ఘౌస్ ), నల్ల శ్రీను ( కోట శ్రీనివాసరావు ) లను అడ్డుకోడానికి బోస్ ప్రయత్నిస్తాడు. చిన్నాను బోస్ అరెస్టు చేస్తాడు. అందుకతడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఇంతలో, పద్మ ( శోభన ) బోస్‌తో ప్రేమలో పడతుంది. వారు పెళ్ళి చేసుకుంటారు. ఒక కుమార్తె కలుగుతుంది. నల్ల శ్రీను పార్టీ అధ్యక్షుడవుతాడు. బోసు, అతని స్నేహితుడూ చిన్న, నల్ల శ్రీనుల పథకాలను అంతం చేయడానికీ వారి నేరాలను ఆపడానికీ ప్రయత్నిస్తారు. బోస్ ను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉండగా చిన్నా బోస్ స్నేహితుడిని చంపేస్తాడు. చివరికి, చిన్నా బోస్ కుమార్తెను కిడ్నాప్ చేస్తాడు. బోస్ తన కుమార్తెను ఎలా కాపాడుకుంటాడు, విలన్లను ఎలా అంతం చేస్తాడు అనేది మిగిలిన కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్ర పాటలకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. ఆకాష్ ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గుప్పు గుప్పు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:30
2."కన్నెపాపా అందుకో"M. M. Keeravaniఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:21
3."ఘల్లుమంది"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:54
4."ఏ జన్మదో"వేటూరి సుందరరామమూర్తికీరవాణి, కె.ఎస్.చిత్ర6:10
5."నీకు నాకు"సిరివెన్నెల సీతారామశాస్త్రిమాల్గాడి శుభ4:18
Total length:25:13
"https://te.wikipedia.org/w/index.php?title=రక్షణ&oldid=3717928" నుండి వెలికితీశారు