కాదంబరి కిరణ్

వికీపీడియా నుండి
(కాదంబరి కిరణ్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాదంబరి కిరణ్
జననం
కాదంబరి కిరణ్ కుమార్

గురజాన పల్లి, కాకినాడ
విద్యబి.కామ్
విద్యాసంస్థశ్రీ రామచంద్ర కాలేజి, హైదరాబాదు.
వృత్తినటుడు
జీవిత భాగస్వామికల్యాణి
పిల్లలుశ్రీకృతి
తల్లిదండ్రులు
  • కె. వి. ఎస్. మూర్తి[1] (తండ్రి)
  • అన్నపూర్ణ (తల్లి)

కాదంబరి కిరణ్ ఒక తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధానమైన, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 270 కి పైగా సినిమాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు. మనం సైతం అనే సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[3] మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కాకినాడలో జన్మించిన ఈయన 1973 లో హైదరాబాదులో ఉన్న మేనమామల దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. నటనపై ఆసక్తితో మొదటగా నాటకాల్లో పాల్గొనేవాడు. 1986 లో టీవీ రంగంలో ప్రవేశించాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే ధారావాహికను నిర్మించి దర్శకత్వం వహించాడు. అది విజయవంతం కావడంతో టీవీలో అన్ని విభాగాల్లో పనిచేశాడు.[3]

సినిమాలు

[మార్చు]
కాదంబరి కిరణ్

మొదటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ లో ఓ చిన్నపాత్రలో నటించాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ జిందాబాద్ అనే చిత్రంలో కూడా నటించాడు.

మూలాలు

[మార్చు]
  1. "కాదంబరి కిరణ్ కుమార్ ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 6 March 2018.
  2. "తెలుగు హాస్యనటుడు కాదంబరి కిరణ్ కుమార్". nettv4u.com. Archived from the original on 26 October 2017. Retrieved 6 March 2018.
  3. 3.0 3.1 "అసహాయులకు అండ..మనం సైతం". sakshi.com. సాక్షి. Retrieved 6 March 2018.
  4. "సినిమా కష్టాలు తీర్చేస్తున్నారు". ఈనాడు. ఈనాడు. 23 April 2018. Archived from the original on 24 April 2018. Retrieved 24 April 2018.
  5. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
  6. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.