నారప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారప్ప
Naarappa First Look Poster.webp
నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వంశ్రీకాంత్ అడ్డాల
నిర్మాతకలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు
రచనవెట్రిమారన్
ఆధారంపూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా
నటులువెంకటేష్
ప్రియమణి
కార్తీక్ రత్నం
ప్రకాష్ రాజ్
మురళీ శర్మ
సంపత్ రాజ్
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

నారప్ప, 2020లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చలనచిత్రం. పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా,[1] తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.[2] వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న[3] ఈ చిత్ర షూటింగ్ 2020, జనవరిలో ప్రారంభమైంది.[4] ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.[5]

కథా సారాశం[మార్చు]

అణగారిన కులానికి చెందిన ఒక కుటుంబం, సంపన్న కులంలోని ధనిక భూస్వామి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని, పరిష్కరించుకునే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అసురన్ సినిమా తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహిస్తానని 2019 నవంబరులో శ్రీకాంత్ అడ్డాల ప్రకటించాడు.[6] 2020, జనవరిలో సినిమాపేరు నారప్ప అని ప్రకటించారు.[7] ఈ చిత్రంలో ప్రియమణి నారప్ప భార్య సుందరమ్మగా, కార్తీక్ రత్నం పెద్ద కొడుకు మునికన్నగా నటించారు.[8]

2020, జనవరి 21న అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని ఒక గ్రామంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరించబడింది.[9]

కరోనా-19 మహమ్మారి కారణంగా 2020, మార్చిలో చిత్రీకరణ నిలిపివేయబడింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Retrieved 13 December 2020.
  2. 2.0 2.1 "Venkatesh Daggubati's Narappa shoot put on hold - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
  3. "Venkatesh starts shoot for 'Asuran' Telugu remake 'Naarappa'". The New Indian Express. 22 January 2020. Retrieved 13 December 2020.
  4. "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Ist. Retrieved 13 December 2020.
  5. "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. 22 January 2020. Retrieved 13 December 2020.
  6. "Telugu director Srikanth Addala to remake Dhanush's 'Asuran'". The News Minute. 2019-11-20. Retrieved 13 December 2020.
  7. Desk, The Hindu Net (2020-01-22). "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. ISSN 0971-751X. Retrieved 13 December 2020.
  8. "Karthik Rathnam's first-look as Munikanna from Narappa released on his birthday - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
  9. Nyayapati, Neeshita (22 January 2020). "Venkatesh's 'Naarappa' begins shoot in Anantapur". The Times of India. Retrieved 13 December 2020.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నారప్ప&oldid=3068526" నుండి వెలికితీశారు