Jump to content

బాషా

వికీపీడియా నుండి
బాషా
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనసురేష్ కృష్ణ
బాలమురుగన్
నిర్మాతఆర్.ఎం. వీరప్పన్ (సమర్పణ)
వి. రాజమ్మాల్
వి. తమిళ్ అఝగన్
తారాగణంరజనీకాంత్
నగ్మా
రఘువరన్
ఛాయాగ్రహణంపి. ఎస్. ప్రకాష్
కూర్పుగణేశ్ కుమార్
సంగీతందేవా
పంపిణీదార్లుసత్య మూవీస్
విడుదల తేదీ
15 జనవరి 1995
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు330 మిలియను (US$4.1 million)

బాషా 1995 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రము సంచలన విజయాన్ని సాధించింది. సుప్రసిద్ద డైలాగ్ ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు ఈ చిత్రం లోనిదే. 2013 లో తెలుగు , తమిళ భాషలలో ఈ చిత్ర డిజిటల్ వెర్షన్ విడుదల కానున్నది.[1][2]

మాణిక్యం (రజనీకాంత్) ఒక ఆటో డ్రైవర్. పేదవారికి, అవసరార్థులకు సహాయం చేస్తుంటాడు. అనవసర వివాదాలకు, పోట్లాటలకు దూరంగా ఉంటుంటాడు. తన తమ్ముడు, చెల్లిని జీవితంలో పైకి తీసుకురావాలనేది అతని ఆశయం. తమ్ముడు శివ పోలీస్ శిక్షణను పూర్తిచేసుకుని నియామక ఉత్తర్వులకోసం ఎదురు చూస్తుంటాడు. మాణిక్యానికి ఒక ధనవంతురాలైన అమ్మాయు ప్రియ (నగ్మా) తో పరిచయం అవుతుంది. అతని నిరాండబరత పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది. మాణిక్యం తమ్ముడు ఇంటర్వ్యూకి హాజరౌతాడు. తన అన్న పేరు మాణిక్యం, అతని జన్మస్థలం బొంబాయి అని విన్న ఉన్నతాధికారులు, మాణిక్యం ని ఒకసారి కలవాలని శివని ఆదేశిస్తారు. వారి ఆదేశానుసారం మాణిక్యం పోలీస్ కమీషనర్ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. మాణిక్యం చెల్లి మంచి మార్కులతో ఉన్నతవిద్య ఉత్తీర్ణురాలౌతుంది. వైద్య కళాశాలలో సీటు కోసం ఆ కళాశాల నిర్వాహకుడిని అభ్యర్తిస్తుంది. కానీ తన కోరిక తీరిస్తేనే సీటు ఇస్తానని, తన గెస్ట్ హౌస్ కి రావాలకి కోరతాడు. విషయం తెలిసిన మాణిక్యం అతడిని కలుస్తాడు. అతడిని చూసిన వెంటనే ఆ కళాశాల నిర్వాహకుడు అతని పాదాల ముందు మోకరిల్లి తనని క్షమించమని, అతని చెల్లెలికి ఎలాంటి షరతులు లేకుండా సీటు ఇస్తానని వేడుకుంటాడు. దీనితో అతని చెల్లి ఆశ్చర్యపోతుంది. అలాగే ఆమెని వేధిస్తున్న అల్లరిమూకపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడి తన తమ్ముడు శివని కూడా ఆశ్చర్యచకితుడిని చేస్తాడు. మాణిక్యం దెబ్బలకు వారంతా తీవ్రంగా గాయపడుతారు. ఇవన్నీ చూసిన తమ్ముడు శివ, మాణిక్యం గతం గురించి ఆరాతీయడం ప్రారంభించడంతో చిత్రకథ ప్రారంభమౌతుంది.

ఇంతకీ మాణిక్యం ఎవరు? అతని గతం ఎలాంటిది? తదితర వివరాలు చిత్ర కథాగమనంలో చూపించబడ్డాయి.

నటవర్గం

[మార్చు]

సంబాషణలు

[మార్చు]
  • ఈ బాషా ఒక్కసారి చెప్పాడంటే, వంద సార్లు చెప్పినట్లు (బాషా ఒరు మారు సొన్నా, నూరు మారు సొన్నా మాదిరి)

సాంకేతికవర్గం

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బాషా

మూలాలు

[మార్చు]
  1. Rajnikanth's Baasha to be re-released Archived 2013-02-22 at the Wayback Machine. The Times of India. (15 April 2011). Retrieved 2012-04-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-09. Retrieved 2013-04-20.
"https://te.wikipedia.org/w/index.php?title=బాషా&oldid=4203456" నుండి వెలికితీశారు