కొరియర్ బాయ్ కళ్యాణ్
కొరియర్ బాయ్ కళ్యాణ్ | |
---|---|
దర్శకత్వం | ప్రేమ్‌సాయి |
రచన | ప్రేమ్‌సాయి |
నిర్మాత | గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటల, సునీత తాటి |
తారాగణం | నితిన్, యామీ గౌతం |
ఛాయాగ్రహణం | సత్యా పోన్మార్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థ | ఫోటాన్ కథాస్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2015 |
సినిమా నిడివి | 104 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు.[1][2] ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో గౌతమ్ మీనన్ నిర్మించాడు.[3] జై హీరోగా తమిళసెల్వనం తనియార్ అంజలం పేరుతో తమిళ భాషలో తెలుగుతోపాటే చిత్రీకరణ జరుపుకుంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరుతోనే హిందీలోకి అనువాదమయింది.
కథ
[మార్చు]డిగ్రీ ఫెయిలై ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ (నితిన్) కావ్య (యామి గౌతమ్)ను చూసి ప్రేమించి, తన కోసమే కొరియర్ బాయ్ గా పనిచేస్తుంటాడు. విదేశాల్లో పేరుగాంచిన డాక్టర్ అశుతోష్ రానా అధిక డబ్బు కోసం ఓ పరిశోధన చేస్తూ, దానికోసం ఇక్కడి డాక్టర్ల సహాయం తీసుకుంటాడు. డెలివరీ కోసం తమ, తమ హస్పిటల్స్ కు వచ్చిన గర్భవతులను వారికి తెలియకుండానే అబార్షన్ చేసి వారిలోని స్టెమ్ సెల్స్ ను సేకరించి అశుతోష్ రానా కు పంపుతుంటారు ఇక్కడి డాక్టర్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డుబాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. అదే కొరియర్ ..కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న నితిన్ చేతిలో పడుతుంది. చివరకు కళ్యాణ్ ఆ కొరియర్ ను సత్యమూర్తికి ఎలా చేర్చాడు అనేది మిగతా సినిమా.
నటవర్గం
[మార్చు]- నితిన్ (కళ్యాణ్)
- యామీ గౌతం (కావ్య)
- బ్రహ్మానందం (నాజర్)
- అశుతోష్ రాణా (అవినీతి డాక్టర్)
- నాజర్ (సత్యమూర్తి)
- హర్షవర్ధన్ (కళ్యాణ్ బావ)
- సురేఖా వాణి (కళ్యాణ్ బావ)
- సత్యం రాజేష్ (కళ్యాణ్ స్నేహితుడు)
- సప్తగిరి (కంపూర్ణేశ్ బాబు/కంపు)
- తెలంగాణ శకుంతల (మేరీ మేడం)
- రవి ప్రకాష్
- గుండు సుదర్శన్
- కాదంబరి కిరణ్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: ప్రేమ్‌సాయి
- నిర్మాత: గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటల, సునితా తాటి
- సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా (నేపథ్య సంగీతం)
- పాటలు: శ్రేష్ఠ
- ఛాయాగ్రహణం: సత్యా పోన్మార్
- కూర్పు: ప్రవీణ్ పూడి
- నిర్మాణ సంస్థ: ఫోటాన్ కథాస్
విడుదల
[మార్చు]2015, సెప్టెంబరు 11న విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు.[4] 2015, సెప్టెంబరు 17న విడుదల అయింది.[5]
పాటలు
[మార్చు]కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు, సోని మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మాయ ఓ మాయ (రచన: శ్రేష్ట)" | కార్తీక్ | 4:20 | ||||||
2. | "బంగారమ్మ (రచన: అనంత శ్రీరామ్, శ్రీచరణ్ కస్తూరిరంగన్)" | శ్రీచరణ్ కస్తూరిరంగన్, కార్తీక్, మేఘ | 3:58 | ||||||
3. | "మందు మందు (రచన: సాహితి)" | కార్తీక్, బాబా సెహగల్ | 3:14 | ||||||
4. | "వాటు కళ్ళ పిల్ల (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | అనూప్ రూబెన్స్, సుచిత్ర | 3:30 | ||||||
15:02 |
మూలాలు
[మార్చు]- ↑ "Nitin's Courier Boy Kalyan on floors soon". 29 June 2012. Archived from the original on 1 జూలై 2012. Retrieved 6 September 2019.
- ↑ "Jai & Richa in 'Tamil Selvanum Thaniyaar Anjalum'?". IndiaGlitz. 11 June 2012. Archived from the original on 15 జూన్ 2012. Retrieved 6 September 2019.
- ↑ "Hero Nitin's new movie "Courier Boy Kalyan"". Times of India. 11 June 2012. Archived from the original on 18 జూన్ 2013. Retrieved 6 September 2019.
- ↑ "Nithin's Courier Boy Kalyan gets its release date"
- ↑ "'Courier Boy Kalyan' postponed yet again"