సుచిత్ర (గాయని)
సుచిత్రా కార్తీక్ కుమార్ | |
---|---|
![]() సుచిత్ర | |
జననం | సుచిత్రా రామదురై ఆగష్టు 14, 1982 |
వృత్తి | నేపథ్య గాయని, నటి, రేడియో జాకీ, కాలమిస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
ఎత్తు | 5'5 |
జీవిత భాగస్వాములు | కార్తీక్ కుమార్ |
వెబ్సైటు | అధికారిక జాలస్థలి |
సుచిత్ర వర్ధమాన చలనచిత్ర నేపథ్యగాయని. ఈమె హైదరాబాదులో జన్మించింది. సెయింట్ ఆన్స్ స్కూలులో చదివింది. తరువాత ఈమె కేరళలో విభిన్న ప్రదేశాలలో పెరిగింది. ఈమె పాఠశాల, కళాశాల చదువు కేరళలోనే సాగింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎం.బి.ఎ.పూర్తి చేసింది. వివాహం తరువాత చెన్నైలో స్థిరపడింది[1]. ఈమె భర్త కార్తీక్ కుమార్ తమిళ సినిమా నటుడు, కమెడియన్.
వృత్తి[మార్చు]
ఈమె మొదట ప్రకటనల రంగంలో ప్రవేశించింది. కొంత కాలం ఒక ప్రముఖ ఐ.టి.సంస్థలో విధులు నిర్వర్తించింది. ఆ తరువాత రేడియోమిర్చీలో రేడియో జాకీగా పనిచేసింది. అక్కడ స్క్రిప్ట్ రైటర్‌గా కూడా బాధ్యతలు నెరవేర్చింది. 'కాఫీ విత్ సుచీ' పేరుతో ఈమె నిర్వహించిన టాక్ షో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఈమె సినిమా పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో వందకు పైగా పాటలను పాడింది. కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించింది.
తెలుగు సినిమా పాటలు[మార్చు]
ఈమె పాడిన పాటలలో కొన్ని పాటలజాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీతం | సాహిత్యం | సహ గాయకులు |
---|---|---|---|---|---|
2004 | ఘర్షణ | చెలియ..చెలియ..చెలియ..చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా | హారిస్ జయరాజ్ | కె.కె. | |
2006 | పోకిరి | డోలే డోలే దిల్ జర జరా | మణిశర్మ | రంజిత్ | |
2006 | పోకిరి | ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే | మణిశర్మ | కార్తీక్ | |
2006 | రణం | చెలి జాబిలి గిల్లిపోకుమా ..చలి వెన్నెల చల్లిపోకుమా | మణిశర్మ | కందికొండ | నవీన్ |
2006 | హ్యాపీ | చిరుత కన్నులవాడే చిలిపి చిన్నోడే | యువన్ శంకర్ రాజా | పోతుల రవికిరణ్ | జస్సీ గిఫ్ట్ |
2007 | చిరుత | మారో మారో మారోరే | మణిశర్మ | భాస్కరభట్ల | రాహుల్ నంబియార్ |
2009 | మల్లన్న | ఎక్స్‌క్యూజ్ మీ మిష్టర్ మల్లన్న కాఫీ తాగుదాం ఆవోనా | దేవీశ్రీ ప్రసాద్ | దేవీశ్రీ ప్రసాద్, విక్రం | |
2010 | అదుర్స్ | పిల్లా నా వల్ల కాదు పిల్లా నా వల్ల కాదు | దేవీశ్రీ ప్రసాద్ | చంద్రబోస్ | మికా సింగ్ |
2010 | కొమరం పులి | ఓ చెకుముకీ ఓ చెకుముకీ నువ్వు చేరగ సరసకే | ఎ.ఆర్.రహమాన్ | చంద్రబోస్ | జావేద్ అలీ |
2010 | బృందావనం | నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా | తమన్ | అనంత్ శ్రీరామ్ | కార్తీక్ |
2011 | కందిరీగ | చంపకమాలా నను చంపకె బాలా | తమన్ | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్ |
2011 | కందిరీగ | హేయ్ ఏంజలీనా ఏంజలీనా హౌ డు యూ డూ హాలివుడ్ సోనా | తమన్ | రామజోగయ్య శాస్త్రి | రానీనా రెడ్డి, రంజిత్ |
2011 | శక్తి | సుర్రో సుర్రన్నాదే సుర్రన్నా యమగున్నాదే సూదంటు కళ్ళోడే సూపుల్తో గిల్లాడే | మణిశర్మ | రామజోగయ్య శాస్త్రి | జావేద్ అలీ |
2012 | దేవుడు చేసిన మనుషులు | డిస్టర్బ్ చేత్తన్నాడే | రఘు కుంచే | భాస్కరభట్ల | |
2012 | నువ్వా నేనా | అయోమయం | భీమ్స్ సెసిరోలియో | కృష్ణ చైతన్య | |
2012 | బిజినెస్ మేన్ | సారొస్తారొస్తారా దావత్తే ఇస్తారా | తమన్ | కైలాష్ రిషి | తమన్ |
2013 | నాయక్ | హే యవారమంటే ఏలూరే అరె నవ్వారు మంచం నెల్లూరే | తమన్ | సాహితి | జస్ప్రీత్ జాస్ |
2013 | మిర్చి | ఆరడుగుల అందగాడు నన్ను బార్బీ గార్ల్ అన్నాడు | దేవీశ్రీ ప్రసాద్ | రామజోగయ్య శాస్త్రి | జస్ప్రీత్ జాస్ |
2013 | బాద్‍షా | యూ ఆర్ మై డైమండ్ గర్ల్ | తమన్ | రామజోగయ్య శాస్త్రి | శింబు |
2015 | శ్రీమంతుడు | జత కలిసే జత కలిసే జగములు రెండూ జత కలిసే | దేవీశ్రీ ప్రసాద్ | రామజోగయ్య శాస్త్రి | సాగర్ |
అవార్డులు[మార్చు]
- బిగ్ తెలుగు మ్యూజిక్ అవార్డ్ - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు బెస్ట్ సింగర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
- 2013 ఫిలిం ఫేర్ అవార్డ్ - బెస్ట్ ప్లేబాక్ సింగర్ అవార్డు - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు.
- 2వ సీమా (SIIMA) అవార్డ్ - బెస్ట్ ఫిమేల్ సింగర్ ఇన్ తెలుగు అవార్డుకు నామినేషన్ - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు.
మూలాలు[మార్చు]
- ↑ ఎడిటర్ (12 February 2012). "విలక్షణ గళంతో సారొచ్చారు". ఈనాడు ఆదివారం. Retrieved 13 April 2017.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from మే 2020
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- తెలుగు సినిమా గాయకులు
- తమిళ సినిమా నేపథ్యగాయకులు
- మలయాళ సినిమా నేపథ్యగాయకులు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- ఫిలింఫేర్ పురస్కార విజేతలు
- 1982 జననాలు