సునితా తాటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీతా తాటి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిసినీనిర్మాత

సునితా తాటి తెలుగు సినిమా నిర్మాత. గురు ఫిలిమ్స్ పై పలు చిత్రాలను నిర్మించింది. ఆమె డి.సురేష్ బాబుతో కలిసి సంయుక్తంగా పలు చిత్రాలను నిర్మించింది.

బాల్యం & విద్యాభాస్యం

[మార్చు]

సునితా తాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో పుట్టి పెరిగింది. ఆమె వర్జీనియాలోని జార్జ్ మసన్ యూనివర్సిటీలో బిజినెస్ మానేజ్మెంట్ కోర్స్ లో డిగ్రీ పూర్తి చేసి, న్యూయార్క్ యూనివర్సిటీ నుండి ఫిలిం కోర్స్ పూర్తి చేసింది.

సినీ ప్రస్థానం

[మార్చు]

సునితా తాటి సినీరంగంలోకి రాకముందు టీవీ9, రేడియో మిర్చిలో పనిచేసింది. ఆమె నిర్మాత డి.సురేష్ బాబు దగ్గర రామానాయుడు స్టూడియోలో పనిచేసింది. సునీత సురేష్ ప్రొడక్షన్స్లో మల్లీశ్వరి, జయం మనదేరా, నగేష్ కుకునూర్ సినిమా హైదరాబాద్ బ్లూస్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.[2][3]

నిర్మించిన చిత్రాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా తారాగణం విభాగం ఇతర వివరాలు
5 2011 షోర్ ఇన్ ది సిటీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత
6 2013 కాదల్ 2 కళ్యాణం నిర్మాత
7 2015 బంగారు కోడిపెట్ట (2014 సినిమా) నవదీప్ కలర్స్ స్వాతి నిర్మాత
8 2015 కొరియర్ బాయ్ కళ్యాణ్ నితిన్, యామి గౌతమ్ నిర్మాత
9 2015 తమిళసిల్వానుమ్ తనియర్ అంజలుమ్ జై, యామి గౌతమ్ నిర్మాత
10 2016 అచ్ఛం ఎంబదు మాదమైయ్యాడా సిలంబరసం, మంజిమ మోహన్ నిర్మాత
11 2016 సాహసం శ్వాసగా సాగిపో అక్కినేని నాగ చైతన్య, మంజిమ మోహన్ సహా నిర్మాత
12 2019 ఓ బేబీ సమంత, లక్ష్మి నిర్మాత కొరియన్‌ సినిమా "మిస్‌గ్రానీ"ని తెలుగులో రీమేక్‌ చేశారు.
13 2020 () రెజీనా, నివేదా థామస్ నిర్మాత కొరియన్‌ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "'Bangaru Kodipetta' gives her the big break". Hindu. 2014-03-08. Retrieved 16 April 2021.
  2. Pecheti, AuthorPrakash. "Setting a trend of their own". Telangana Today. Retrieved 16 April 2021.
  3. "Master Class by Sunitha Tati, Well-Known Film Producer". AISFM Blog. 2017-02-21. Archived from the original on 2021-04-16. Retrieved 16 April 2021.