సాహసం శ్వాసగా సాగిపో
సాహసం శ్వాసగా సాగిపో | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ మీనన్ |
రచన | కోన వెంకట్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | గౌతమ్ మీనన్ |
కథ | గౌతమ్ మీనన్ |
నిర్మాత | మిర్యాల రవీందర్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | డాన్ మకర్తూర్
డానీ రేమాండ్ తెని ఈశ్వర్ |
కూర్పు | ఆంటోని |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | ద్వారక క్రియేషన్స్ ఫోటాన్ కథాస్ |
విడుదల తేదీ | 11 నవంబరు 2016[1] |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
సాహసం శ్వాసగా సాగిపో 2016 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌతమ్ మీనన్ రచన, దర్శకత్వం వహించాడు. [2] ఈ చిత్రంలో నాగ చైతన్య మంజిమా మోహన్ [3] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేమలో పడిన చలాకీ యువకుడి కథను చెబుతుంది. అయితే ఊహించని సంఘటనలలో, అతను అతని ప్రియమైనవారు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ఇది మీనన్ అచ్చం యెన్‌భాధు మదమైయడ పేరుతో తమిళంలోను తెలుగు లోనూ చిత్రీకరించిన ద్విభాషా చిత్రం. [4] ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. [5] 2016 నవంబరు 11 న డీమోనిటైజేషన్ తర్వాత రెండు రోజుల తరువాత [6] విడుదలైంది [7] సానుకూల సమీక్షలను అందుకుంది. [8]
కథ
[మార్చు]రజనీకాంత్ మురళీధర్ ( నాగ చైతన్య ) ఒక చిన్న గుంపుతో గొడవ పడుతూండగా సినిమా మొదలౌతుంది. అతను తన సోదరి మైత్రేయి గురించి చెడుగా మాట్లాడినందుకు వాళ్ళతో గొడవ పడ్డాడని తరువాత తెలుస్తుంది.
తన పేరును చెప్పుకోడానికి సంకోచించే రజనీకాంత్ ఎంబియ్యే చదువుతున్నాడు. అతని సన్నిహితులు మహేష్, శ్యామ్, శ్రీకాంత్ ఆటో డ్రైవర్ సెల్వం లు. ఒక సాయంత్రం రజనీకాంత్, తన సోదరిని ప్రేమించమంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తి వద్దకు తిరిగి వెళ్తాడు. మహేష్ తన ప్రేయసి దివ్యతో కలిసి వారి ప్రాంతంలో గడిపినప్పుడు వారి మధ్య గొడవ జరుగుతుంది. ఏదో ఒకవిధంగా అన్ని విషయాలు సమసిపోతాయి. కొన్ని రోజులు గడిచిపోతాయి. రజనీకాంత్ తన జీవితంలో వచ్చే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోగల నమ్మకంతో ఉన్నానని, వాటిని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
రజనీకాంత్ ఇప్పుడు కొద్దిగా పెరిగాడు. అతని గతంలో 2 ప్రేమ కథలు ఉన్నాయి. ఒకటి సుకన్యతో, మరొకటి మల్లికతో. ఇప్పుడు అతను తన కొత్త థండర్బర్డ్ బైక్ ను తన మొట్టమొదటి ప్రేయసిగా భావిస్తాడు. ఈ సమయంలో అతను తన సోదరి మైత్రేయి స్నేహితురాలు లీల ( మంజిమా మోహన్ ) ను కలవడానికి వస్తాడు. తన కోర్సు పూర్తి చేయడానికి ఆమె రజనీకాంత్ ఇంట్లో ఉంటుంది. రజనీకాంత్ ఆమెతో ప్రేమలో పడతాడు, వారిద్దరూ పగలూ రాత్రీ చాలా సేపు మాట్లాడుకుంటూంటారు. రజనీకాంత్ లీలతో తన ప్రేమకథను తన స్నేహితులకు రోజూ చెబుతూంటాడు.
రజనీకాంత్ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి కన్యాకుమారికి బైకు మీద లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. కాని చివరికి అతనితో పాటు మహేష్ బదులు లీల వెళ్తుంది. వారు చెన్నై, సేలం, త్రివేండ్రం మీదుగా కన్యాకుమారికి వెళతారు. పర్యటనలో వారు ఒక గ్రామీణ గ్రామానికి వెళ్లి ఒక రాత్రి బస చేస్తారు, అక్కడ వారిని సహృదయుడైన గ్రామస్థుడు (మదురై మోహన్) చూసుకుంటాడు. మరుసటి రోజు వారు కన్యాకుమారి చేరుకుని సూర్యోదయాన్ని చూస్తారు. ఇక్కడ లీలా రజనీకాంత్ ప్రేమలో పడుతుంది. పర్యటన తరువాత రజనీకాంత్ లీలను కొల్హాపూర్ లోని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టడానికి అంగీకరిస్తాడు. బిజీగా ఉన్న హైవేలో మహారాష్ట్రకు వెళ్లే దారిలో, ఘోర ప్రమాదానికి గురవుతాడు, అతని భుజం విరుగుతుంది. అదే రోజు లీలా తల్లిదండ్రులపై మహారాష్ట్రలో దాడి జరుగుతుంది.
అది ప్రమాదం కాదనీ, ఏదో తప్పు జరిగిందనీ వారు భావిస్తారు. అదే రోజు, లీల తల్లిదండ్రులు గాయపడ్డారు. ఆమె తండ్రి మళ్ళీ బ్రతికేటట్లు లేదు. ఇది లీలను చంపే ప్రణాళిక అని వారు తెలుసుకుంటారు. ఇప్పుడు రజనీకాంత్, స్నేహితుడు మహేష్ తో పాటు ఆసుపత్రికి వస్తాడు. రజనీకాంత్ తన జీవితంలో హింసాత్మక దశ లోకి ప్రవేశిస్తాడు. అతను లీలనూ ఆమె కుటుంబాన్నీ రక్షించాలని నిర్ణయించుకుంటాడు.
అయితే, ఊహించని దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు విషయాలు అధ్వాన్నంగా మారతాయి. సినిమా రెండవ సగం బాగా కుదిరింది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు, పోలీస్ ఆఫీసర్ కామత్ ( బాబా సెహగల్ ), ఒక గ్యాంగ్ స్టర్ హిరెన్ ( డేనియల్ బాలాజీ ) లను నాశనం చేయడంలో నిర్భీతి స్పష్టంగా కనిపిస్తుంది. రామన్‌ను అతని భార్యనూ చంపడానికి అవాంఛిత పనులు చేసాడు కామత్. ఈ ప్రక్రియలో మహేష్‌ను కూడా చంపారు. కామత్ ఇప్పుడు మహేష్ అంత్యక్రియల సమయంలో కూడా రజనీకాంత్ ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను రజనీకాంత్ ఇంటికి చేరుకుంటాడు, అక్కడ అతను రజనీకాంత్ మురళీధరన్ ఐపిఎస్ అని తెలుస్తుంది. లీలా తల్లిదండ్రులు చంపబడిన అదే కొల్లాపూర్ లో అతడికి పోస్టింగు వస్తుంది. చివరగా అతను కామత్‌ను హత్య చేసి, లీలతో కలిసి కన్యాకుమారికి తిరిగి వెళ్తాడు.
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "షోకిల్లా" | ఆదిత్య రావు, ఎడికె, శ్రీ రస్కోల్, రాకెండు మౌళి | 4:38 | ||||||
2. | "కన్నుల ముందే" | హరిచరణ్, చిన్మయి | 3:38 | ||||||
3. | "చకోరి" | సత్య ప్రకాష్, షాషా తిరుపతి | 5:38 | ||||||
4. | "తానూ నేనూ" | విజయ్ ప్రకాష్ | 4:13 | ||||||
5. | "వెళ్ళిపోమాకే" | సిడ్ శ్రీరాం, ఎడికె | 4:26 | ||||||
21:56 |
మూలాలు
[మార్చు]- ↑ "Sahasam Swasaga Sagipo gets a release date". timesofindia.
- ↑ "Gautham Menon, Naga Chaitanya reunite for Telugu film". 2015-05-08.
- ↑ "Bilingual beginning for Manjima Mohan". 2016-11-07.
- ↑ "Why teasers of Gautham Menon's 'Sahasam Swasaga Sagipo', 'Achcham Yenbadhu Madamaiyada' are just so perfect". 2015-08-31.
- ↑ "AR Rahman to produce a masterclass for Chaitu's next".
- ↑ "Gautham Menon: I want to launch Naga Chaitanya in Tamil". 2016-11-18.
- ↑ "Naga Chaitanya-starrer Sahasam Swasaga Sagipo to release on November 11". 2016-11-01.
- ↑ "Saahasam Swaasaga Saagipo review round-up: Naga Chaitanya's film bags good verdict, rich ratings from critics". 2016-11-11.