మంజిమా మోహన్
మంజిమా మోహన్ | |
---|---|
జననం | తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 1993 మార్చి 11
నివాసం | తిరువనంతపురం |
జాతీయత | భారతీయులు |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1998 - 2002,2015 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | విపిన్ మోహన్ కళమందలం గిరిజ |
మంజిమా మోహన్ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం మరియు మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె కేరళ లోణి పలక్కాడ్ కు చెందినది. ఆమె 1990ల చివర మరియు 2000ల మొదట్లో బాలనటిగా నటించింది. ఆమె సినిమా కథానాయకిగా అరంగేట్రం చేసిన మొదటి సినిమా "ఓరు వడక్కన్ సెల్‌ఫీ". ఆమె రెండవ చిత్రం తమిళంలో "అచ్ఛం ఎంబదు మదమైయదా". ఆమెకు 2017 లో దక్షిణాదిలో 64వ ఫిలిం ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నటిగా అందుకున్నది.[1][2][3]
వ్యక్తిగత జీవితం[మార్చు]
మంజిమా మోహన్ కు సినిమా రంగ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి విపిన్ మోహన్ సినీ ఛాయాగ్రాహకుడు మరియు తల్లి కలమండలం గిరిజ నాట్యకారిణి. ఆమె పాఠశాల విద్యను తిరువనంతపురం లోని నిర్మల భవన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసిన తదుపరి తమిళనాడులోని స్టెల్లా మారిస్ కళాశాల, చెన్నైలో బి.యస్సీ డిగ్రీ చేసింది.[4]
సినిమా జీవితం[మార్చు]
ఆమెకు అనుభవం నటన కలిగి ఉన్నప్పటికీ, ఆమెకు పూర్తి విశ్వాసం ఉండేది కాదని తెలిపింది. ఆమెకు సినిమా షూటింగ్ ప్రారంభ రోజులలో భయానకంగా ఉండేదని తెలిపింది.[5] ఆమె నటించిన "ఓరు వదక్కన్ సెల్‌ఫీ"ని జి. ప్రజిత్ దర్శకత్వం వహించాడు మరియు వినీత్ శ్రీనివాసన్ స్క్రిప్టు రాసాడు. ఈచిత్రంలో ఆమె ప్రధాన మహిళా పాత్రలో నటించింది.[6]
ఆ చిత్రంవిడుదల సమయంలో ఆమె తమిళ చిత్రం "అచ్చం ఎందదు మదమైయద" చిత్రంతో తమిళ చిత్రసీమలో ప్రవేశించింది.[2][3] ఆమె నటించిన "ఓరు వదక్కన్ సెల్‌ఫీ"లో ఆమె నటనకు ఆకర్షితుదైన గౌతం మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వంవహించాడు.[7] ఈ చిత్రంలో ఆమె ప్రధాన మహిళా అపత్రను నటించింది.[8]
ఆమె తరువాత తమిళ చిత్రాన్ని ఉధయానిధి స్టాలిన్ తో[9][10] మరియు విక్రం ప్రభుతో "షత్రియన్"లో నటించింది.[11]
చిత్రాలు[మార్చు]
Year | Title | Role | Language | Notes |
---|---|---|---|---|
1998 | కలియూంజల్ | యువ "అమ్ము" | మలయాళం | బాల నటి |
మాయిల్‌పీలిక్కవు | గాయత్రి బంధువు | మలయాళం | బాల నటి | |
1999 | సఫలం | శ్రీతుమోల్ | మలయాళం | బాల నటి |
2000 | ప్రియం | అను | మలయాళం | బాల నటి ఉత్తమ బాలనటి, ఆసియానెట్ ఫిల్మ్ పురస్కారం. |
తెంకాసిపట్టణం | యువ "దేవూట్టి" | మలయాళం | బాల నటి | |
మధురనొంబరకట్టు | మాయా | మలయాళం | బాల నటి బాలనటి, కేరళ స్టేట్ ఫిలిం పురస్కారమ్ | |
2001 | సుందర పురుషన్ | సూర్యనారాయణ కుమార్తె | మలయాళం | బాల నటి |
2002 | తాందావం | గుర్తించబడని పాత్ర | మలయాళం | బాల నటి |
2015 | ఓరు వడాక్కన్ సెల్‌ఫీ | డైసీ జార్జ్ | మలయాళం | |
2016 | సాహసం శ్వాసగా సాగిపో | లీలా | తెలుగు | |
అచ్చం యెనుబదు మదమైయదా | తమిళం | దక్షిణాదిలో 64వ ఫిలిం ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నటి | ||
2017 | షత్రియన్ | నిరంజన్ | తమిళం | |
ఇప్పడాయి వెళ్ళుం | భార్గవి | తమిళం | ||
2018 | జాం జామ్ | To Be Announced | మలయాళం | నిర్మాణ దశ |
మూలాలు[మార్చు]
- ↑ http://indiatoday.intoday.in/story/64th-filmfare-awards-south-2017-madhavan-suriya-best-actor/1/981419.html
- ↑ 2.0 2.1 "Manjima Mohan - Gijju". gijju (ఆంగ్లం లో). Retrieved 2017-04-11.
- ↑ 3.0 3.1 http://www.deccanchronicle.com/150513/entertainment-kollywood/article/manjima-new-heroine-simbu
- ↑ http://english.manoramaonline.com/entertainment/interview/manjima-mohan-oru-vadakkan-selfie-nivin-pauly-from-child-actor-to-daisy.html
- ↑ http://www.newindianexpress.com/entertainment/reviews/She-is-Back/2015/02/03/article2649341.ece
- ↑ http://www.thehindu.com/news/national/kerala/selfie-clicks-becomes-years-first-superhit/article7070011.ece
- ↑ http://www.sify.com/movies/manjima-mohan-is-str-s-heroine-in-gautham-menon-film-news-malayalam-pfnjexedghgbc.html
- ↑ http://www.deccanchronicle.com/150513/entertainment-mollywood/article/lady-luck-smiles-manjima-mohan
- ↑ http://www.behindwoods.com/tamil-movies-cinema-news-17/udhayanidhi-gaurav-project-titled-as-ippadai-vellum.html
- ↑ http://www.sify.com/movies/lyca-signs-udhayanidhi-to-be-directed-by-gaurav-narayanan-news-tamil-qgvj6Eebgehhi.html
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/Manjima-Mohan-cast-opposite-Vikram-Prabhu/articleshow/50167381.cms
ఇతర లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మంజిమా మోహన్ పేజీ
- నా దృష్టంతా దానిమీదే: మంజిమా మోహన్ http://www.andhrajyothy.com/artical?SID=513869 నా దృష్టంతా దానిమీదే: మంజిమా మోహన్