ఎఫ్ఐఆర్
ఎఫ్.ఐ.ఆర్ | |
---|---|
దర్శకత్వం | మను ఆనంద్ |
రచన | మను ఆనంద్ దివ్యంగా ఆనంద్ శంకర్ |
కథ | మను ఆనంద్ |
నిర్మాత | అభిషేక్ నామా |
తారాగణం | విష్ణు విశాల్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మంజిమా మోహన్ రెబ్బా మోనికా జాన్ రైజా విల్సన్ మాల పార్వతి |
ఛాయాగ్రహణం | అరుల్ విన్సెంట్ |
కూర్పు | ప్రసన్న జీకే |
సంగీతం | అశ్వత్ |
నిర్మాణ సంస్థ | అభిషేక్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | అభిషేక్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 11 ఫిబ్రవరి 2022 12 మార్చి 2022 (ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎఫ్ఐఆర్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, రెబ్బా మోనికా జాన్, మంజిమా మోహన్, గౌతమ్ నారాయణ్, రైజా విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో నటుడు రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఫిబ్రవరి 11న విడుదల చేశాడు.[2]
చిత్ర నిర్మాణం
[మార్చు]విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో నటుడు రవితేజ సమర్పణలో[3] అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా విడుదల చేశాడు. ఈ సినిమాలోని ప్రయాణం అనే మొదటి పాటను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఫిబ్రవరి 2న చేయగా,[4] ట్రైలర్‌ను నటుడు నాని విడుదల ఫిబ్రవరి 4న విడుదల చేయగా[5] ఫిబ్రవరి 11న సినిమా విడుదలైంది.
కథ
[మార్చు]ఇర్ఫాన్ (విష్ణు విశాల్) ఓ కెమికల్ ఇంజనీర్. ఓ కంపెనీలో పార్ట్ టైమ్ లో పనిచేస్తుంటాడు. మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అబు బకర్ అబ్దుల్లా కోసం ఇంటిలిజెన్స్ విభాగం గాలిస్తుంటుంది. అబూ బకర్ దేశ వ్యాప్తంగా బాంబు బ్లాస్టింగులు ప్లాన్ చేశాడని, ఓ విధ్వంసానికి రెడీ అవుతున్నాడని తెలిసి ఇంటిలిజెన్స్ విభాగం ఎలెర్ట్ అవుతుంది. ఇర్ఫాన్ చేసిన కొన్ని పొరపాట్లు, యాదృచ్ఛిక ఘటనల వల్ల అతనే అబూబకర్ అని ఇంటెలిజెన్స్ అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకుంటుంది. అసలు ఇర్ఫాన్ పై ఇంటిలిజెన్స్‌కి ఎందుకు అనుమానం వచ్చింది? నిజంగా ఇర్ఫానే అబూబకరా? అనేదే మిగతా సినిమా కథ.[6]
నటీనటులు
[మార్చు]- విష్ణు విశాల్
- రెబా మోనికా జాన్
- మంజిమా మోహన్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- గౌతమ్ నారాయణ్
- రైజా విల్సన్
- మాల పార్వతి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
- సమర్పణ: రవితేజ
- నిర్మాత: అభిషేక్ నామా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మను ఆనంద్[7]
- సంగీతం: అశ్వంత్
- సినిమాటోగ్రఫీ:అరుల్ విన్సెంట్
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (11 March 2022). "12న ఓటీటీలో 'ఎఫ్.ఐ.ఆర్.'". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 2022-02-11. Retrieved 12 February 2022.
- ↑ Eenadu (7 February 2022). "'ఎఫ్‌ఐఆర్'లాంటి సినిమా చేయాలనుంది: రవితేజ". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
- ↑ Andhra Jyothy (2 February 2022). "పయనం అంటూ వచ్చిన 'ఎఫ్ఐఆర్' ఫస్ట్ సింగిల్". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
- ↑ Namasthe Telangana (4 February 2022). "డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్‌ఐఆర్". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
- ↑ Eenadu (11 February 2022). "రివ్యూ: ఎఫ్‌ఐఆర్". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
- ↑ Namasthe Telangana (10 February 2022). "ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.