మాల పార్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతి టి.
జననం (1968-05-18) 1968 మే 18 (వయసు 55)
వృత్తినటి,
మనస్తత్వవేత్త,
టీవీ యాంకర్,
పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

మాల పార్వతి (జననం 1968 మే 18) భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె అసలు పేరు పార్వతి టి.

ఆమె పలు డబ్బింగ్ సినిమాలలోనే కాకుండా గేమ్ ఓవర్, టక్ జగదీష్, అమ్ము[1] వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె తిరువనంతపురంలో అడ్వకేట్ సి. వి. త్రివిక్రమన్, గైనకాలజిస్ట్ డాక్టర్ కె. లలిత దంపతులకు జన్మించింది. ఆమె ఆల్ సెయింట్స్ కాలేజీ నుండి ప్రీ-డిగ్రీ పూర్తి చేసి యూనివర్శిటీ యూనియన్ కౌన్సిలర్‌గా పనిచేసింది. ఆమె గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదటి సంవత్సరంలో కాలేజ్ యూనియన్‌కి వైస్ చైర్‌పర్సన్‌గా చేసింది, ఆ తర్వాత ఆమె రెండవ సంవత్సరంలో కళాశాల యూనియన్ చైర్‌పర్సన్‌గా, సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్ (SPIC MACAY)కి క్యాంపస్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేసింది. ఆమె కేరళ యూనివర్శిటీ కరియావట్టం క్యాంపస్, తిరువనంతపురం నుండి సైకాలజీలో మాస్టర్స్, ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే కేరళ లా అకాడమీలో ఆమె ఎల్‌ఎల్‌బి చదివింది.

కెరీర్[మార్చు]

ఆమె ఆసియానెట్‌లో ఉల్కజ్చా కార్యక్రమం యాంకరింగ్‌తో తన కెరీర్ మొదలుపెట్టింది. 2007లో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం టైమ్ ద్వారా తన నటనను ప్రారంభించింది. నీలతామర (2009), లీల (2016), కన్యకా టాకీస్ (2013), మున్నారిప్పు (2014), టేక్ ఆఫ్ (2017), కామ్రేడ్ ఇన్ అమెరికా (2017), గోధ (2017), గేమ్ ఓవర్ (2019), సీ యూ సూన్ (2020), మార (2021), భీష్మ పర్వం వంటివి ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు. ఆమె తిరువనంతపురంలోని అభినయ అనే థియేటర్ గ్రూప్‌తో కూడా అనుబంధం కలిగి ఉంది. ఆమె దర్శకుడు ఎం.జి. జ్యోతిష్‌తో కలిసి ది లేడీ ఫ్రమ్ ది సీ (సాగర కన్యక), ది లెసన్, భగవదజ్జుగం నాటకాలకు పనిచేసింది.

ఆమె మయూరగీతంగల్ అనే పుస్తకాన్ని రచించింది. దామోదర్ నారాయణన్ స్వరపరిచిన శ్రీప్రసాదం, మేగమల్హర్ మ్యూజికల్ ఆల్బమ్‌లకు పంక్తులు రాసింది. ఆమె మహిళల హక్కుల పట్ల మక్కువ కలిగి ఉంది. జీబివి నుండి బయటపడిన అనేకమందికి మద్దతు ఇచ్చింది. ఆమె 2006 నుండి ఎం.ఎస్.ఎల్. గ్రూప్‌కి పీఆర్ కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. ఆమె క్లయింట్‌లలో హే ఫెస్టివల్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మొదలైనవి ఉన్నాయి. ఆమె 2016 నుండి టెన్ డిగ్రీ నార్త్ కమ్యూనికేషన్స్‌లో కూడా పని చేస్తోంది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె కేరళ ప్రభుత్వ సి-డిట్‌లో పనిచేస్తున్న బి. సతీశన్‌ను వివాహం చేసుకుంది. వీరికి అనంతకృష్ణన్ అనే కుమారుడు ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Ammu review: రివ్యూ: అమ్ము.. ఐశ్వర్య లక్ష్మి, నవీన్‌ చంద్రల సినిమా ఎలా ఉందంటే? | aishwarya lekshmi and naveen chandra starer ammu review". web.archive.org. 2023-08-18. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ""This city should turn out as the safest one for women": Parvathi T". entecity.com. Archived from the original on 2020-04-07. Retrieved 2023-08-18.