గౌతమ్ మీనన్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రముఖ తమిల ఇండస్ట్రీ దర్శకుడు. ఇతను తెలుగులో వెంకటేష్తో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఘర్షణ, నాగచైతన్యతో ఒక ప్రేమ కథా చిత్రం ఏ మాయ చేశావే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అటు తమిళ్లో సింబు, త్రిష జంటగా విన్నైతాండి వరువాయ పేరుతో, ఇటు తెలుగులో ఏ మాయ చేశావే పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
నేపద్యం[మార్చు]
గౌతమ్ 1973లో కేరళలోని పలక్కడ్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రిమలయాళీ, తల్లి తమిళియన్. గౌతమ్ తిరుచ్చిలో పెరిగారు. కళాశాల్లో చదువుతున్న రోజుల్లో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. వారు సమ్మతించడంతో ఆ బాటలోనే అడుగులు వేస్తూ.. 1997లో ‘మిన్సర కనవు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. ఇందులో ఆయన ఓ పాత్రలో కూడా నటించారు. 2001లో మాధవన్‌తో ‘మిన్నెల’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అలా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన తెరకెక్కించిన ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేసావె’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు దేనికదే ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి
గౌతమ్ మీనన్ తీసిన సినిమాల జాబితా[మార్చు]
సంవత్సరము పేరు భాష వివరణ
- 2001 : మిన్నలే (తమిలము) : ఈ సినిమా తెలుగులోకి చెలి పేరుతో అనువదించబడింది.
- 2003 : కాక్క కాక్క (తమిలము ) : ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతో రీమేక్ చెయ్యబడింది.
- 2004 : ఘర్షణ తెలుగు --
- 2006 : వెట్టైయాడు విల్లైయాడు (తమిలం) : ఈ సినిమా "రాఘవన్" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
- 2007 : పచైకిలి ముతుచారం (తమిలం) : ఈ సినిమా "ద్రోహి" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
- 2008 : వారణం అయిరాం ( తమిలం) ఈ సినిమా "సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్" పేరుతో తెలుగు లోకి అనువదిన్చబడింది.
- 2010 : విన్నైతాండి వరువాయ ( తమిలం ) --
- 2010 : ఏ మాయ చేశావే తెలుగు --
- 2011 : నదూషిని నాయంగల్ ( తమిలం) ఈ సినిమా "ఎర్ర గులాబీలు" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
- 2012 ఏక్ దీవానా థా హింది
- 2012 నీథానె ఎన్ పొన్ వసంతమ్ తమిలం
- 2012 నిత్య తెలుగు