కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే | |
---|---|
దర్శకత్వం | దేసింగ్ పెరియస్వామి |
రచన | దేసింగ్ పెరియస్వామి |
నిర్మాత | అంటో జోసెఫ్ వయాకమ్ 18 స్టూడియోస్ |
తారాగణం | దుల్కర్ సల్మాన్ రితు వర్మ గౌతమ్ మీనన్ |
ఛాయాగ్రహణం | కె.ఎం.భాస్కరన్ |
కూర్పు | ప్రవీణ్ ఆంథోనీ |
సంగీతం | బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు: మసాలా కేఫ్ |
నిర్మాణ సంస్థలు | అంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ వయాకమ్ 18 స్టూడియోస్ |
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2020 |
సినిమా నిడివి | 162.10 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కనులు కనులను దోచాయంటే 2020లో విడుదలైన తెలుగు సినిమా. వయాకమ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై వయాకమ్ 18, ఆటో జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాకు దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, రితూ వర్మ, రక్షణ్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లయడిత్తా’గా, తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో ఫిబ్రవరి 28, 2020న విడుదలైంది. తెలుగులో కేఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్ కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, డా. రవికిరణ్ విడుదల చేశారు.
కథ
[మార్చు]సిద్థార్ధ్(దుల్కర్ సల్మాన్), కల్లీస్(రక్షణ్) ఇద్దరు స్నేహితులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటారు. సిద్దార్థ్ యాప్ డెవలపర్ గా, కల్లిస్ యానిమేటర్ గా పనిచేస్తూ రిచ్ లైఫ్ ను అనుభవిస్తుంటారు. వీళ్లిద్దరు మీరా(రీతూవర్మ) శ్రేయ(నిరంజని)తో ప్రేమలో పడతారు. నలుగురు కలిసి గోవా వెళతారు. వీళ్ల జీవితాల్ని పోలీసు కమిషనర్ ప్రతాప్ సింహా (గౌతమ్ మీనన్) ఎలా మలుపు తిప్పాడు? తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[1][2][3]
నటీనటులు
[మార్చు]- దుల్కర్ సల్మాన్
- రితు వర్మ
- రక్షణ్
- గౌతమ్ మీనన్
- నిరంజని అహతియాన్
- అనీష్ కురువిల్లా
- వికాస్ రాజేంద్రన్
- టైగర్ గార్డెన్ తంగదురై
- అమీషా చౌదరి
- ఉదయ్ మహేష్
- గజరాజ్
- లక్ష్మీ
- బేబీ మోనికా శివ
- కథిర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వయాకమ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
- నిర్మాత: వయోకామ్ 18 స్టూడియోస్, ఆటో జోసెఫ్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: దేసింగ్ పెరియస్వామి
- సంగీతం: మసాలా కేఫ్, హర్షవర్దన్ రామేశ్వర్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
- సినిమాటోగ్రఫీ: కె.ఎం.భాస్కరన్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "చేరొక్కటో" | సామ్రాట్ నాయుడు | మసాలా కాఫీ | హర్షవర్ధన్ రామేశ్వర్ | 3:17 |
2. | "గుండెగిల్లి" | సామ్రాట్నా యుడు , పూర్ణ చర్య చల్లూరి | మసాలా కాఫీ | రోహిత్ పరిటాల | 3:54 |
3. | "వారే వాహ్ మామ" | సామ్రాట్నా యుడు | మసాలా కాఫీ | అభిజిత్ రావు | 3:30 |
4. | "కథలే కలగా" | సామ్రాట్ నాయుడు | మసాలా కాఫీ | అనురాగ్ కులకర్ణి | 2:06 |
5. | "నా మదిని" | సామ్రాట్ నాయుడు | హర్షవర్ధన్రా మేశ్వర్ | జనని ఎస్.వి | 2:19 |
6. | "ఆశలేని" | సామ్రాట్ నాయుడు | హర్షవర్ధన్ రామేశ్వర్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | 1:20 |
7. | "కనులు కనులను దోచాయంటే" | సామ్రాట్ నాయుడు | హర్షవర్ధన్ రామేశ్వర్ | గౌతమి అశోక్ | 1:06 |
8. | "మాగా మాగా" | హర్షవర్ధన్ రామేశ్వర్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | హర్షవర్ధన్ రామేశ్వర్, కావ్య అజిత్ | 3:41 |
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (28 February 2020). "'కనులు కనులను దోచాయంటే' మూవీ రివ్యూ". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ Eenadu (28 February 2020). "రివ్యూ: కనులు కనులను దోచాయంటే". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ Sakshi (28 February 2020). "'కనులు కనులను దోచాయంటే' రివ్యూ". Sakshi. Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.