రీతు వర్మ

వికీపీడియా నుండి
(రితు వర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రీతు వర్మ
జననం
రీతు వర్మ

(1990-03-10) 1990 మార్చి 10 (వయసు 34)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్

రీతు వర్మ (జననం:10 మార్చి 1990[1]) తెలుగు సినిమా నటి. కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో చేసిన నటనకు గాను ఆమె పేరొందింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన రీతు షార్ట్ ఫిలింస్ ద్వారా సినిమాల్లో కెరీర్ ప్రారంభించింది. పెళ్ళిచూపులు (2016) సినిమాలో కథానాయిక పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నది.[2]

నేపధ్యం[మార్చు]

రీతు వర్మ  1990 మార్చి 10న హైదరాబాద్ లో జ‌న్మించింది. ఆమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ అనంతరం డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో పాల్గొని రెండవ స్థానం పొందింది.[3]

కెరీర్[మార్చు]

రీతు వర్మ అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో నటించడంతో పేరు పొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది, ఇందులో నటనకు రీతు వర్మ ఉత్తమ నటిగానూ పురస్కారాన్ని పొందింది.[4] 2013లో సినిమా కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ లో ప్రదర్శితమైంది.[5]

అనుకోకుండాలో నటించాకా, ఆమె తొలిగా తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం ప్రారంభించింది.[6]ప్రేమ ఇష్క్ కాదల్[7] నటిగా ఆమెకు తొలి సినిమా, అందులో కాస్ట్యూం డిజైనర్ పాత్రను పోషించింది.. తర్వాత నా రాకుమారుడు సినిమాలోనూ, ఆపైన ఎవడే సుబ్రహ్మణ్యంలోనూ నటించింది..[8] చిన, పిరై తేడియ నాట్కల్ అన్న తమిళ సినిమాల్లోనూ నటితున్నది.[9] 2016లో విజయ్ దేవరకొండ కథానాయకునిగా పెళ్ళిచూపులు సినిమాకు కథానాయిక పాత్ర పోషించింది.. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైనది కావడం, ఆమె మంచి నటన కనబరడంతో ప్రశంసలు పొందింది.[10]

సినిమాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2013 బాద్‍షా తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ సమీర తెలుగు
2014 నా రాకుమారుడు బిందు తెలుగు
2015 ఎవడే సుబ్రహ్మణ్యం రియా తెలుగు ఐఐఎఫ్ఓ ఉత్సవంలో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్
2016 చిన
షెర్లిన్ తమిళం పోస్ట్-ప్రొడక్షన్
2016 పెళ్ళిచూపులు చిత్ర తెలుగు విమర్శకుల ప్రశంసలు, గుర్తింపు
2016 పిరై తేడియల్ నాట్కల్ తమిళం చిత్రీకరణ దశలో
2021 నిన్నిలా నిన్నిలా తెలుగు
2021 టక్‌ జగదీష్‌ (2021)[11] తెలుగు
2022 ఒకే ఒక జీవితం వైష్ణవి తెలుగు ద్విభాషా సినిమా[12]
కణం తమిళ్
నీదాం ఒరు వానమ్ \ తెలుగులో ఆకాశం (2022 సినిమా) తమిళ్ \ తెలుగు [13]
2023 మార్క్ ఆంటోని తమిళ్ \ తెలుగు
2024 శ్వాగ్‌ [14]

వెబ్ సిరీస్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Date of Birth and Biography". Archived from the original on 17 ఏప్రిల్ 2015. Retrieved 24 April 2015.
  2. Namasthe Telangana (15 May 2021). "గ్యాప్‌ ఇవ్వలే.. వచ్చింది!". Namasthe Telangana. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
  3. NTV (10 March 2022). "న‌వ‌త‌రం నాయిక రితూ వ‌ర్మ‌!". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-09-10.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-26. Retrieved 2016-09-10.
  6. "Ritu Varma excited about her Telugu debut". The Times of India. Retrieved 26 November 2013.
  7. "Prema Ishq Kadhal to be aired on TV soon". The Times of India. Retrieved 17 April 2015.
  8. "Ritu Varma to romance Nani".
  9. "Ritu Varma's becoming familiar with Tamil".
  10. http://www.deccanchronicle.com/151102/entertainment-tollywood/article/vijay-and-ritu-pelli-choopulu
  11. Namasthe Telangana (8 September 2021). "Rithu Varma | గ్లామర్‌ పాత్రలు చేస్తా!". Archived from the original on 10 సెప్టెంబరు 2021. Retrieved 10 September 2021.
  12. "Sharwanand's next titled Oke Oka Jeevitham". The New Indian Express. Retrieved 2021-07-17.
  13. "Ashok Selvan, Ritu Varma team up again". The New Indian Express. 2022-02-08.
  14. Chitrajyothy (11 March 2024). "రాణి రుక్మిణీ దేవి". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రీతు_వర్మ&oldid=4162015" నుండి వెలికితీశారు