బంగారు కోడిపెట్ట (2014 సినిమా)
Jump to navigation
Jump to search
బంగారు కోడిపెట్ట | |
---|---|
దర్శకత్వం | రాజ్ పిప్పళ్ళ |
రచన | ప్రసాద్ వర్మ పెన్మత్సా (మాటలు) |
నిర్మాత | సునీత తాటి |
తారాగణం | నవదీప్ కలర్స్ స్వాతి |
ఛాయాగ్రహణం | సాహిర్ రజా |
కూర్పు | చంద్రశేఖర్ జివి |
సంగీతం | మహేష్ శంకర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 7 మార్చి 2014[1][2] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బంగారు కోడిపెట్ట 2014, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో నవదీప్, కలర్స్ స్వాతి నటించిన ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- నవదీప్ (వంశీ)
- కలర్స్ స్వాతి (భానుమతి పినిశెట్టి)
- హర్షవర్ధన్
- సంతోష్ (వేణు)
- సుధ
- సీత
- యువరాజు
- కోట శంకరరావు
- రామ్ (ఎర్రబాబు)
- లక్ష్మణ్ (దొరబాబు)
- సంచలన (శృతి)[3]
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజ్ పిప్పళ్ళ
- నిర్మాత: సునితా తాటి
- మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్సా
- సంగీతం: మహేష్ శంకర్
- ఛాయాగ్రహణం: సాహిర్ రజా
- కూర్పు: చంద్రశేఖర్ జివి
- నిర్మాణ సంస్థ: గురు ఫిల్మ్స్
ప్రొడక్షన్ - విడుదల
[మార్చు]నవ్‌దీప్, స్వాతి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ - లక్ష్మణ్ కీలకపాత్రల్లో నటించారు.[4] ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ 2012, జూలై 24న విడుదలయింది.[5] 2012, నవంబరు 13న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.[6]
ఈ చిత్రానికి భారతదేశ ఫిల్మ్ సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. 2014, ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించినా, మార్చి 7న విడుదలయింది.[7] తరువాత ఈ సినిమా లవ్ పన్నూంగా లైఫ్ నల్లా ఇరుక్కుం పేరుతో తమిళంలోకి అనువాదమయింది.[8]
పాటలు
[మార్చు]మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు 2013, జూలై 3న నటి సమంత చేతులమీదుగా విడుదలయ్యాయి.[9]
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "బుల్లి బుల్లి పిట్ట" | రీటా త్యాగరాజన్, సుచిత్ సురేసన్ | |
2. | "ఏమో నేమో" | సుచిత్ సురేసన్ | |
3. | "అల్లో నేరెల్లో" | అమృతవర్షిణి | |
4. | "తధాస్తు" | మహేష్ శంకర్, మేఘా గిరీష్ | |
5. | "ఓ లచ్చ" | ఉషా ఉతుప్ | |
6. | "గోగులు పూచే" | ఉషా ఉతుప్, అమృతవర్షిణి, మహేష్ శంకర్, మేఘా గిరీష్, రీటా త్యాగరాజన్, సుచిత్ సురేసన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Review: Bangaru Kodipetta". aptoday.com. 7 March 2014. Archived from the original on 4 March 2016. Retrieved 1 August 2019.
- ↑ "Review : Bangaru Kodipetta – This hen is too slow". 123telugu.com. Archived from the original on 1 August 2019. Retrieved 1 August 2019.
- ↑ "Bangaru Kodipetta News Journal Three stories". idlebrain.com. Archived from the original on 4 March 2016. Retrieved 1 August 2019.
- ↑ "Bangaru Kodipetta News Journal introducing Bhanumati Pinnesetty character". idlebrain.com. Archived from the original on 24 September 2015. Retrieved 2 August 2019.
- ↑ "Navadeep,Swathi's Bangaru Kodipetta Movie First Look". 24 July 2012. Retrieved 2 August 2019.[permanent dead link]
- ↑ "Bangaru Kodi Petta first look". 13 November 2012. Archived from the original on 17 September 2017. Retrieved 2 August 2019.
- ↑ "'Bangaru Kodipetta' postponed again". 123telugu.com. Archived from the original on 2 August 2019. Retrieved 2 August 2019.
- ↑ "LOVE PANNUNGA LIFE NALLA IRUKUM - IMAGES". behindwoods.com. Archived from the original on 28 February 2019. Retrieved 2 August 2019.
- ↑ "Bangaaru Kodi Petta Movie Audio Released". idlebrain.com. 3 July 2013. Archived from the original on 19 July 2018. Retrieved 1 August 2019.