Jump to content

కోట శంకరరావు

వికీపీడియా నుండి
కోట శంకరరావు
జననం
కోట శంకరరావు

ఆగస్టు 10
విద్యబి. కాం.
వృత్తిసినిమా నటుడు, రంగస్థల నటుడు, టి.వి.నటుడు
జీవిత భాగస్వామిభాగ్యలక్ష్మి
తల్లిదండ్రులు
  • కోట సీతారామాంజనేయులు (తండ్రి)
  • విశాలాక్షి (తల్లి)

కోట శంకరరావు సినీ నటుడు, రంగస్థల నటుడు. ఇతడు నటుడు కోట శ్రీనివాసరావు తమ్ముడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు ఆగస్టు 10న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు నంది అవార్డులు లభించాయి.[1]

నాటకాలు

[మార్చు]
  1. నాగులు తిరిగే కోనలో
  2. హర హర మహదేవ
  3. రసరాజ్యం
  4. మినిస్టర్
భాగ్యరేఖ (ధారావాహిక)

టి.వి.సీరియల్స్

[మార్చు]
  1. శ్రీమతి
  2. గాయిత్రీ
  3. జీవన సంధ్య
  4. భాగ్యరేఖ
అంకురం

సినిమాలు

[మార్చు]
  1. అంకురం
  2. ఆంటీ (1995)
  3. అగ్నిప్రవేశం
  4. అరుపు
  5. ఆటోవాల జిందాబాద్
  6. ఆపద మొక్కులవాడు
  7. చదువుకోవాలి
  8. జై తెలంగాణ
  9. డర్టీగేమ్‌
  10. తుంగభద్ర
  11. ధర్మచక్రం
  12. నాకూ పెళ్ళాం కావాలి - తొలి సినిమా
  13. బ్యాండ్ బాజా
  14. మనసే మాయ
  15. మిస్టర్ మనీ
  16. యుగానికి ఒక్క ప్రేమికుడు
  17. లవ్ అంటే
  18. వీడా!
  19. సూత్రధారులు
  20. సూర్య ఐ.పి.ఎస్
  21. నందీశ్వరుడు

పురస్కారాలు

[మార్చు]
  • విజయవాడ కల్చరల్ అకాడమీ వారిచే ఎస్.వి.రంగారావు 2016 పురస్కారం[2]
  • బెంగళూరులోని న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ వారిచే గౌరవ డాక్టరేట్

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి- తారలతో ముచ్చట్లు (10 December 2018). "ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు". www.andhrajyothy.com. Archived from the original on 10 ఆగస్టు 2019. Retrieved 10 August 2019.
  2. "కోట శంకరరావుకు ఎస్‌విఆర్‌ పురస్కారం". Archived from the original on 2017-01-02. Retrieved 2017-01-02.

బయటి లింకులు

[మార్చు]