Jump to content

ఆలస్యం అమృతం

వికీపీడియా నుండి
ఆలస్యం అమృతం
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రమహేష్
నిర్మాణం దగ్గుబాటి రామానాయుడు
కథ ఎస్. పృథ్వీతేజ
చిత్రానువాదం చంద్రమహేష్
తారాగణం నిఖిల్ సిద్ధార్థ్,
మదాలస శర్మ
సంగీతం కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం పూర్ణ కాండ్రు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 3 డిసెంబరు 2010[1]
నిడివి 119 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆలస్యం అమృతం 2010, డిసెంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సారథ్యంలో చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, మదాలస శర్మ జంటగా నటించగా, కోటి సంగీతం అందించాడు.[2]

ఉత్తమ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నంది పురస్కారం.

కథా నేపథ్యం

[మార్చు]

రామ్ (నిఖిల్) కు యు.ఎస్.ఏ.లో ఉద్యోగం వస్తుంది. అన్నవరం గుడికి వెళ్ళి మొక్కు చెల్లించి హైదరాబాదు వెళ్ళడానికి రైల్వే స్టేషనుకు వస్తాడు. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్ళి చేస్తుండడంతో ఇంటినుండి వచ్చేసిన వైదేహి (మదలసా శర్మ) ను అక్కడ కలుస్తాడు. స్టేషన్‌లో నెల వయసున్న బాబును రామ్, వైదేహి చూస్తారు. ఆ బాబు తల్లిదండ్రులను కనుగొనడానికి వాళ్ళిద్దరూ చేసే ప్రయత్నమే మిగతా కథ.[3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[5]

  1. మొదటి క్షణం - శ్రీకృష్ణ, ఎం.ఎల్. శృతి - 4:27
  2. హేయ్ పిల్లా - రంజిత్, గీతా మాధురి - 4:24
  3. ఓలమ్మీ తింగరబుచ్చి - సింహా, చిత్ర - 3:45
  4. ఏడవకే - కార్తీక్, మాళవిక, అంజనా సౌమ్య - 4:22
  5. దగ దగ దగ - శ్రీ కృష్ణ, సాయి శివాని - 3:57

మూలాలు

[మార్చు]
  1. @fyreviews (3 December 2010). "Telugu movies releasing today: Rakta Charitra -2 and Alasyam Amrutham (December 3rd 2010) shar.es/XWM01" (Tweet) – via Twitter.
  2. "Alasyam Amrutham is interesting". rediff.com. 6 December 2010. Retrieved 4 August 2020.
  3. 123telugu. "Alasyam Amrutham Movie Review". 123telugu.com. Retrieved 4 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Alasyam Amrutham Review". CineGoer.com. 5 December 2010. Archived from the original on 6 May 2014. Retrieved 4 August 2020.
  5. జియో సావన్, పాటలు. "Aalasyam Amrutham - All Songs - Download or Listen Free - JioSaavn". www.jiosaavn.com. Retrieved 4 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]