Jump to content

శివారెడ్డి (నటుడు)

వికీపీడియా నుండి
శివారెడ్డి
జననం1974 (age 49–50)
వృత్తినటుడు, మిమిక్రీ కళాకారుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1994-ప్రస్తుతం

శివారెడ్డి నటుడు, మిమిక్రీ కళాకారుడు, వ్యాఖ్యాత. 100 కి పైగా సినిమాల్లో నటించాడు.[1] దేశ విదేశాల్లో 6000 కి పైగా అనేక ప్రదర్శనలిచ్చాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శివారెడ్డి 1974 లో కరీంనగర్ జిల్లా, రామగుండంలో జన్మించాడు. శివారెడ్డి బాల్యంలో డ్యాన్సు, పాటలంటే ఆసక్తి చూపేవాడు. తండ్రి దేవాలయానికి తీసుకెళితే అక్కడ భక్తి పాటలు పాడేవాడు. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసేవాడు. ఉపాధ్యాయులను అనుకరించి నవ్వించేవాడు. పదో తరగతి పూర్తి కాగానే శివారెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. కానీ అతనికి వయసు సరిపోకపోవడంతో ఎక్కడా అవకాశాలు రాలేదు. అక్క పెళ్ళి కోసం వరంగల్ వచ్చిన శివారెడ్డిని నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర అనే ఆయన దూరదర్శన్ లో నృత్యం చేయమని కోరాడు. అలాగే ప్రముఖ జానపద కళాకారుడు సారంగపాణి తన ప్రదర్శనలన్నింటికీ ఇతన్ని వెంటపెట్టుకుని తిప్పడంతో అతనికి వరంగల్ జిల్లాలో మంచి గుర్తింపు వచ్చింది.

కెరీర్

[మార్చు]

సినీ నిర్మాత సానా యాదిరెడ్డి పరిచయంతో మొదటి సారిగా పిట్టల దొర సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత బ్యాచిలర్స్, అమ్మాయి కోసం, ఆనందం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మనసంతా నువ్వే, అతడే ఒక సైన్యం, వసంతం, నాగ, నేనున్నాను తదితర చిత్రాల్లో నటించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1996 పిట్టల దొర
2001 ఆనందం
2001 అమ్మాయి కోసం
2003 ఆయుధం
2003 నీ మనసు నాకు తెలుసు
2003 వసంతం
2003 కేడీ నం 1
2003 ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ
2003 నాగ
2004 అతడే ఒక సైన్యం మిమిక్రీ ఆర్టిస్టు
2004 గూఢచారి 117
2004 కారు దిద్దిన కాపురం
2004 దొంగ దొంగది
2004 ఎక్స్ట్రా
2004 ఐతే ఏంటి
2004 అడవి రాముడు
2004 కాశి
2005 రంభ నీకు ఊర్వశి నాకు
2005 చక్రం
2006 స్టాలిన్
2008 రెయిన్‌బో
2010 ఆలస్యం అమృతం
2010 పప్పు
2010 బురిడీ
2010 నమో వెంకటేశ సంగీత కళాకారుడు
2011 జై బోలో తెలంగాణా
2011 వస్తాడు నా రాజు
2011 నగరం నిద్రపోతున్న వేళ
2011 దూకుడు మిమిక్రీ కళాకారుడు
2011 క్రికెట్ గర్ల్స్ & బీర్
2012 తిక్క[2]
2017 2 కంట్రీస్
2020 అమరం అఖిలం ప్రేమ
2024 వి లవ్ బ్యాడ్ బాయ్స్
2024 జ్యుయల్ థీఫ్

మూలాలు

[మార్చు]
  1. "శివారెడ్డి వెబ్ సైటు". shivareddy.co.in. శివా రెడ్డి. Retrieved 18 November 2016.[permanent dead link]
  2. http://www.123telugu.com/mnews/srihari-priyamani-and-posani-in-thikka.html