వసంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసంతం
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమన్
నిర్మాణం ఎన్.వి.ప్రసాద్,శానం నాగ అశోక్ కుమార్
రచన విక్రమన్
తారాగణం వెంకటేష్
ఆర్తీ అగర్వాల్
కళ్యాణి
చంద్ర మోహన్
సునీల్
తనికెళ్ళ భరణి
సూర్య
హేమ
శివారెడ్డి
ఆకాష్
ఆహుతి ప్రసాద్
ప్రసాద్ బాబు
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
గీతరచన వేటూరి,సిరివెన్నెల సీతారామశాస్త్రి,చంద్రబోస్,కులశేఖర్
సంభాషణలు చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్
భాష తెలుగు

వెంకటేష్ కథానాయకునిగా తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన వసంతం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.[1] ఈ సినిమాలో క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు.

కథ[మార్చు]

అశోక్, జూలీ చిన్ననాటి స్నేహితులు. అశోక్ జూలీ తండ్రి పీటర్ తోనూ చాలా సన్నిహితంగా ఉంటాడు. అశోక్, జూలీ ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. హఠాత్తుగా పీటర్ చనిపోవడంతో జూలీని ఇంటికి తీసుకు వస్తాడు అశోక్. ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. తనకు తిండి పెట్టడమే ఎక్కువని పైగా ఆమెను ఎలా భరిస్తామని ఇంట్లో వాళ్ళు అనడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు అశోక్. అంతకు ముందే నందినిని ప్రేమించి ఉంటాడు. ముందుగా జూలీకి పెళ్ళి చేయాలని నిశ్చయించి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకోసం తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను పణంగా పెట్టడానికి వెనుకాడడు.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • అమ్మో అమ్మయేనా , రచన: కుల శేఖర్ , గానం.హరిహరాన్ , సుజాత మోహన్.
  • గాలి చిరుగాలి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.చిత్ర .
  • నిను చూడక ముందర , రచన: కుల శేఖర్ ,గానం. హరిహరణ్.
  • గోదారల్లే పొంగే , రచన: కుల శేఖర్ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
  • ఓ జాబిల్లి , రచన: కుల శేఖర్, గానం. కె ఎస్ . చిత్ర
  • అమ్మో అమ్మాయేన ,(బిట్) రచన: కుల శేఖర్ , గానం.హరిహరన్
  • గాలి చిరుగాలి (బిట్) రచన: సిరివెన్నెల ,గానం. చిత్ర
  • జాం పండువే దోర జాం పండువే , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.ఉదిత్ నారాయణ్ , సుజాత మోహన్.
  • ఓ లాలీ పాపకి , రచన: చంద్రబోస్ ,గానం. శంకర్ మహదేవన్.

అవార్డులు[మార్చు]

నంది పురస్కారాలు (2003)[మార్చు]

  1. రాంబాబు - ఉత్తమ వస్త్రాలంకరణ.
  2. ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
  3. ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.

మూలాలు[మార్చు]

  1. "వెండితెరపై విరిసిన స్నేహ 'వసంతం' - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-27. Retrieved 2020-07-12.
"https://te.wikipedia.org/w/index.php?title=వసంతం&oldid=4155838" నుండి వెలికితీశారు