హేమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమ
జన్మ నామంకోళ్ళ కృష్ణవేణి
జననం
రాజోలు
భార్య/భర్త సయ్యద్ జాన్ అహ్మద్
పిల్లలు ఈషా

హేమ తెలుగు సినిమా నటి. హాస్య మరియు ప్రధాన పాత్రలు చేస్తుంటుంది.

విశేషాలు[మార్చు]

ఈమె అసలు పేరు కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు గ్రామంలో కోళ్ళ కృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించింది. అక్కడే హైస్కూలు వరకు చదివి డిగ్రీ ప్రైవేటుగా చదివింది. మద్రాసులో నృత్యం నేర్చుకుంది. హీర మనరోజా అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1989లో భలేదొంగ సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో హాస్యనటిగా, క్యారెక్టర్ నటిగా పేరు తెచ్చుకుంది. సుమారు 200కు పైగా సినిమాలలో నటించింది. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఈషా.[1][2]

రాజకీయాలు[మార్చు]

2014లో సమైక్యాంద్ర పార్టీ తరపున మండపేట శాసనసభకు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది.

నటించిన తెలుగు సినిమాల జాబితా[మార్చు]

 1. భలేదొంగ (1989)
 2. జయమ్ము నిశ్చయమ్మురా(1989)
 3. చిన్నారి స్నేహం(1989)
 4. స్వాతి చినుకులు(1989)
 5. ముద్దుల మావయ్య(1989)
 6. పల్నాటి రుద్రయ్య(1989)
 7. బాలగోపాలుడు(1989)
 8. ధర్మయుద్ధం(1989)
 9. పైలా పచ్చీస్(1989)
 10. అయ్యప్పస్వామి మహత్యం(1989)
 11. చెవిలో పువ్వు(1990)
 12. క్షణక్షణం (1991)
 13. నువ్వు నాకు నచ్చావ్ (2001)
 14. మురారి (2001)
 15. వసంతం (2003)
 16. దోస్త్ (2004)
 17. 143 (2004)[3][4]
 18. అతడు (2005)
 19. ఒక ఊరిలో (2005)
 20. భగీరథ (2005)
 21. అన్నవరం (2006)
 22. బాస్ (2006)
 23. మాయాజాలం (2006)
 24. సీతారాముడు(2006)
 25. ఒక్కడున్నాడు (2007)
 26. యమగోల మళ్ళీ మొదలైంది (2007)
 27. అష్టా చమ్మా (2008)
 28. ఆపద మొక్కులవాడు (2008)
 29. కుబేరులు (2008)
 30. కౌసల్యా సుప్రజా రామ (2008)
 31. గోరింటాకు (2008)
 32. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
 33. జోష్ (2009)
 34. బంగారు బాబు (2009)
 35. రైడ్ (2009)
 36. విసు (2010)
 37. క్షేత్రం (2011)
 38. వీడు తేడా (2011)
 39. జులాయి (2012)
 40. అత్తారింటికి దారేది (2013)
 41. దూసుకెళ్తా (2013)
 42. గాలిపటం (2014)
 43. జోరు (2014)[5]
 44. కుమారి 21ఎఫ్ (2015)
 45. డిక్టేటర్ (2016)
 46. సిల్లీ ఫెలోస్ (2018)[6]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఎడిటర్ (17 February 2016). "ఇంటర్వ్యూ". నవ్య వీక్లీ. 12 (50): 72-73. Retrieved 10 February 2016.
 2. Dr.Seshagirirao. "Tollywood photo profiles". Tollywood photo profiles. Dr.Seshagirirao. Retrieved 10 February 2016.
 3. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
 4. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
 5. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
 6. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=హేమ&oldid=2680554" నుండి వెలికితీశారు