గోరింటాకు (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరింటాకు
దర్శకత్వంవి. ఆర్. ప్రతాప్
నిర్మాతఆర్. బి. చౌదరి, పరాస్ జైన్
తారాగణండా.రాజశేఖర్
ఆర్తీ అగర్వాల్
ఆకాష్
మీరా జాస్మిన్
సంగీతంఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ
సంస్థ
సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీ
జూలై 4, 2008 (2008-07-04)
భాషతెలుగు

గోరింటాకు వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2008లో విడుదలైన కుటుంబకథా చిత్రం.[1] ఇందులో రాజశేఖర్, ఆర్తీ అగర్వాల్, మీరా జాస్మిన్, ఆకాష్, హేమా చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది కన్నడంలో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన అన్న తంగి అనే సినిమాకు పునర్నిర్మాణం. ఈ చిత్రాన్ని ఆర్. బి. చౌదరి, పరాస్ జైన్ కలిసి సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఇది మరుధని అనే పేరుతో తమిళంలోకి అనువాదమైంది.

అశోక్, లక్ష్మి అన్నాచెల్లెళ్ళు. ఆ ఊరికి జమీందారులైన వాళ్ళ తల్లిదండ్రులు వీరు చిన్నతనంలోనే మరణిస్తారు. అప్పటి నుంచీ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. లక్ష్మి ఆకాష్ ని ప్రేమిస్తుంది. కానీ తన అన్న అనుమతిస్తేగానీ తమ వివాహం జరగడానికి ఒప్పుకోదు. అశోక్ వాళ్ళ ప్రేమను అంగీకరించి వారిద్దరికీ పెళ్ళి చేస్తాడు. అశోక్ నందినిని పెళ్ళి చేసుకుంటాడు. ఆకాశ్ లక్ష్మి సంతోషంగా జీవిస్తుంటారు. ఏడేళ్ళ తర్వాత లక్ష్మికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు పుడతారు. నందిని గర్భంతో ఉండగా ఆమెకు కాంతం అనే ఆవిడ వల్ల గర్భస్రావం అవుతుంది. అంతే కాకుండా ఆమెకు గర్భసంచి తీసేయాల్సి వస్తుంది.

అన్నకు ఇక పిల్లలు పుట్టరని తెలిసిన లక్ష్మి తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వస్తుంది. అదే సమయానికి ఆకాష్ బంధువులు అతన్ని మోసం చేసి అతని ఆస్తినంతా కాజేస్తారు. ఆకాష్ జైలుపాలవుతాడు. అదే సమయానికి కాంతం లక్ష్మిని పిల్లలని ఆ ఇంటి నుంచి తరిమేయమని నందినిని రెచ్చగొడుతుంది. తన భర్తను బయటకు తీసుకురాలేక, పిల్లలని పోషించలేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటుంది లక్ష్మి. అది తెలుసుకున్న అశోక్ కూడా మరణిస్తాడు.

తారాగణం : పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gorintaku". Sify (in ఇంగ్లీష్). Retrieved 2020-07-09.