Jump to content

రాజశేఖర్ (నటుడు)

వికీపీడియా నుండి
(డా.రాజశేఖర్ నుండి దారిమార్పు చెందింది)
రాజశేఖర్
జననం (1962-02-04) 1962 ఫిబ్రవరి 4 (వయసు 62)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1985 - ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిజీవిత
పిల్లలుశివాని
శివాత్మిక
తల్లిదండ్రులు
  • వరదరాజన్‌ గోపాల్‌ [1] (తండ్రి)
  • ఆండాళ్ (తల్లి)


డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు.[2][3][4] ఇతని మొదటి చిత్రం వందేమాతరం.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వరదరాజన్‌ గోపాల్‌, ఆండాళ్ పిళ్ళై.[5] తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్నా తండ్రి కోరిక మేరకు వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు.[6] సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది.

కుటుంబం

[మార్చు]

1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దురు కూతుర్లు - శివాని, శివాత్మిక. శివాని ఎం. బి. బి. ఎస్ చదువుతోంది. శివాత్మిక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ముఖ్య పాత్రల్లో కలిసి నటించిన దొరసాని అనే చిత్రం విడుదలైంది.

సినిమా వృత్తి

[మార్చు]

రాజశేఖర్ తొలి సినిమా వందేమాతరం. అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది.[7] ఆయన ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ధి. మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.

ఒక దశలో సినిమాలో సరిగా ఆడక స్వంత ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్ళీ నిలదొక్కుకోగలిగాడు. 2019లో ఆయన నటించిన కల్కి సినిమా విడుదలైంది.

నటించిన చిత్రాలు

[మార్చు]
*ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (4 November 2021). "హీరో డాక్టర్‌ రాజశేఖర్‌కు పితృవియోగం!". Archived from the original on 4 నవంబరు 2021. Retrieved 4 November 2021.
  2. Turmoil in T-town - Times Of India
  3. Rajasekhar - Telugu Actor Gallery stills images clips
  4. "Rajasekhar finds policeman's role irresistible | Deccan Chronicle". Archived from the original on 2013-12-30. Retrieved 2014-01-29.
  5. "The Hindu : Andhra Pradesh / Hyderabad News : Actor Rajasekhar to join politics". Archived from the original on 2008-11-02. Retrieved 2014-01-04.
  6. "The Hindu : Andhra Pradesh / Hyderabad News : Bholakpur: cholera claims 1 more". Archived from the original on 2013-03-05. Retrieved 2014-01-04.
  7. మహ్మద్, అన్వర్ (14 July 2019). "నిద్ర మాత్రలు వేసుకున్నా". ఈనాడు. Archived from the original on 14 జూలై 2019. Retrieved 14 జూలై 2019.

ఇతర లింకులు

[మార్చు]