వందేమాతరం (1985 సినిమా)
Appearance
వందేమాతరం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. కృష్ణ |
---|---|
తారాగణం | రాజశేఖర్, విజయశాంతి , రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
భాష | తెలుగు |
వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమా పేరుతో వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.[1]
1985 వసంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
కథ
[మార్చు]అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- విజయశాంతి
- రాజేంద్ర ప్రసాద్
- సుత్తి వీరభద్రరావు
- సుత్తి వేలు
- పి.ఎల్.నారాయణ
- సాక్షి రంగారావు
- నర్రా వెంకటేశ్వర రావు
- పి.సాయికుమార్
- డబ్బింగ్ జానకి
- నిర్మలమ్మ
- జయమాలిని
- అనురాధ
పాటలు
[మార్చు]- ఆకాశమా, నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ?
- వందేమాతరం, వందేమాతరం, వందేమాతరగీతం వరుస మారుతున్నది
మూలాలు
[మార్చు]- ↑ ఎం. ఎల్, నరసింహం. "'Vandemataram', the song that became a surname for singer Srinivas". thehindu.com. Retrieved 29 December 2017.