అన్న (సినిమా)
అన్న | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
నిర్మాత | పోకూరి బాబూరావు |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు) |
నటులు | డా.రాజశేఖర్, గౌతమి, రోజా |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల | 1994 |
భాష | తెలుగు |
అన్న 1994 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, గౌతమి, రోజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను 1995 లో IIFA చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.[1] ఈ సినిమా సుదీప్, అంజలా జవేరీ, ఆశా సైనీ ప్రధాన తారాగణంగా ఎన్.శంకర్ దర్శకత్వంలో 2005లో కన్నడ భాషలో నమ్మణ్ణ పేరుతో పునర్మించబడింది. తిరిగి నమ్మణ్ణను తెలుగులో దౌర్జన్యం పేరుతో డబ్ చేశారు.
కథ[మార్చు]
రాజశేఖర్ ఉపాధి వెతుక్కుంటూ పల్లెటూరు నుంచి తమ్ముడిని తీసుకుని ముంబై వెళతాడు. అక్కడ నిజాయితీ గల ఒక లాయరు, ఆయన ఇద్దరు కుమార్తెల సహాయంతో బ్రతుకు దెరువు కోసంఆటో డ్రైవర్ గా కుదురుకుంటాడు. పల్లెటూరి పద్ధతులు మార్చుకుని నగర జీవనం మొదలు పెడతారు. తమ్ముడిని కూడా బడిలో చేరుస్తాడు.
నగరంలో రెండు ముఠాలు ఆధిపత్యం కోసం పోరాడుతుంటాయి. ఒక అవినీతిపరుడైన మంత్రి తన మనుగడ కోసం ఇద్దరి ముఠాలను పెంచి పోషిస్తూ నగరంలో అల్లర్లు రేపుతుంటాడు. ఒక ముఠావారు తనకు సహాయం చేసిన లాయరును చంపేస్తారు. అది రాజశేఖర్ తమ్ముడు చూసి అన్నకు చెబుతాడు. ఆ సంగతి తెలుసుకున్న ముఠా ఆ చిన్నపిల్లవాణ్ణి కూడా హత్య చేస్తారు. రాజశేఖర్ ఆ ముఠా వాళ్ళపై పగతీర్చుకుని ఒక నిజాయితీ పరుడైన పోలీసు అధికారి సహాయంతో ఒక నాయకుడిగా ఎదుగుతాడు. అందరూ అతన్ని అన్న అని పిలుస్తుంటారు. గౌతమిని పెళ్ళి చేసుకుంటాడు. ఒక బిడ్డ కలుగుతాడు. అతనికి తన తమ్ముడి పేరే పెడతాడు. గౌతమి ఒక వైపు అనుక్షణం భయంతీ బ్రతుకుతూ భర్తను ఆ గొడవలన్నింటి నుంచి బయటపడమని చెబుతూ ఉంటుంది. రాజశేఖర్ ఆ పరిస్థితులను చక్కదిద్దుకుని తన కుటుంబంతో సంతోషంగా ఎలా ఉన్నాడన్నది మిగతా కథ.[2]
తారాగణం[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-04-15. Retrieved 2016-10-26.
- ↑ Tfn, Team. "Anna(rajashekar)". Telugu Filmnagar (in ఇంగ్లీష్). Retrieved 2020-07-30.