Jump to content

అదృష్టదీపక్

వికీపీడియా నుండి
అదృష్టదీపక్
జననం1950 జనవరి 18
మరణం2021 మే 16(2021-05-16) (వయసు 71)
మరణ కారణంకోవిడ్-19 వ్యాధి (కరోనా)
విద్యఎమ్.ఎ.
వృత్తిచరిత్ర అధ్యాపనం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు
జీవిత భాగస్వామిస్వరాజ్యం
పిల్లలుచక్రవర్తి (కుమారుడు),
కిరణ్మయి
తల్లిదండ్రులుసత్తి సూరమ్మ (తల్లి)
బంగారయ్య (తండ్రి)

అదృష్టదీపక్ (1950 జనవరి 18 - 2021 మే 16) భారతీయ కవి.[1] ద్రాక్షారామం పీవీఆర్ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా 1979లో చేరి 2008లో ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన సాహిత్యంపై మక్కువతో నాటకాలు, సినిమాల రంగాలలో విశేష కృషి చేసాడు.[2]

అచ్చయిన పుస్తకాలు

[మార్చు]
  • కోకిలమ్మ పదాలు (1972)
  • అగ్ని (1974)
  • సమరశంఖం (1977)
  • ప్రాణం (1978)
  • అడవి (2008) (1978-2008 మధ్యలో అచ్చయినవి, ప్రసారమైనవీ)
  • సంపాదకత్వం : చేతన (అరసం కవితా సంకలనం)

అవార్డులు - రివార్డులు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)[3]
  2. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)
  3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)
  4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు, సాహితీ పురస్కారం (2004)
  5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారథ్యంలో పౌరసన్మానం, ఉగాది పురస్కారం (2004)
  6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కే. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
  7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
  8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం (2008)
  9. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం[4] (2010)
  10. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘‘సృజనాత్మక సాహిత్యం’’లో కీర్తి పురస్కారం (2010)

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]

సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు. తన అనుభూతులకు కవితారూపం యిచ్చే నేర్పుకూడావుంది యితనికి.. -రాచమల్లు రామచంద్రారెడ్డి

దృష్టదీపక్ కు తన లక్ష్యం యేమిటో, దాన్ని యెలా సాధించాలో తెలుసు. వర్తమాన సమాజం పట్ల తీవ్ర అసంతృప్తి అంతరంగంలో ప్రజ్వలిస్తున్నా దాన్ని వ్యక్తీకరించడంలో ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. "అక్షరాల రెక్కలు విప్పుకుని " "కన్నీళ్ళు కవిత్వంగా" మారుతాయంటాడు."కొడిగట్టిన ఆశను కొత్తకోరికలతో తిరిగి రగిలించు" అంటూ భవిష్యత్తు పట్ల అనంతమైన ఆశను ప్రకటిస్తాడు అదృష్టదీపక్.- గజ్జెల మల్లారెడ్డి

అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! - తనికెళ్ళ భరణి.

ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను...- బ్నిం

అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత! - ద్వా.నా.శాస్త్రి

రసికుం డదృష్ట దీపకు డసమానమ్మైన కవిగ నాంధ్రావనిలో కుసుమించిన చెంగలువగ వసియించుచునుండు సతము ప్రజల మనములన్ - డాక్టర్ రాధశ్రీ

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (16 May 2021). "అభ్యుదయ రచయిత 'అదృష్టదీపక్' ఇకలేరు". www.andhrajyothy.com. Archived from the original on 16 May 2021. Retrieved 16 May 2021.
  2. "Adrushta Deepak Pallikonda Passed Away Due To Covid: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్‌ కన్నుమూత - Sakshi". web.archive.org. 2024-01-15. Archived from the original on 2024-01-15. Retrieved 2024-01-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ప్రముఖ కవి అదృష్ట దీపక్ కోవిడ్ తో మృతి | TRENDING TELUGU NEWS". www.trendingtelugunews.com. 16 May 2021. Archived from the original on 16 May 2021. Retrieved 16 May 2021.
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.