Jump to content

చర్చ:అదృష్టదీపక్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ దిగువ విషయం విజ్ఞాన సర్వస్వం శైలిలో లేని కారణంగా పక్కన పెడుతున్నాను. Chavakiran 04:09, 31 అక్టోబర్ 2008 (UTC)


నచ్చిన వ్యక్తులు-

తత్వశాస్త్రం: కారల్ మార్క్స్, లెనిన్

సాహిత్యం : వేమన, గురజాడ, శ్రీశ్రీ, రా.రా.

నటన : యస్వీ రంగారావు, సూర్యకాంతం, సావిత్రి

అవధానాలమీద మీ వ్యాసం చూశాను. చాలా బావుంది. ఒక నెలరోజులుగా అలాంటి వ్యాసం రాయాలని అనుకుంటూనే కాలహరణం చేశాను. మీరు వ్రాశారు. నాకంటే బాగా రాశారు. చక్కని వ్యాసం రాసినందుకు నా అభినందనలు అందుకోండి. -వల్లంపాటి వెంకటసుబ్బయ్య]], మదనపల్లె ..............

మీ ‘చాసోజ్ఞాపకాలు’ బావున్నాయి. ఎమ్మే చదువుతున్నరోజుల్లో మీరు శ్రీశ్రీ, రా.రా., గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, మొదలైనవారి గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వినేవాణ్ని. ఇప్పటివాళ్ళకు తెలియని మీ అనుభవాలూ, విశేషాలూ వరుసగా రాస్తే బావుంటుంది. మీశైలికూడా ఎదుటివారితో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉంటుంది. అది అందరికీ సాధ్యంకాదు. -కొప్పర్తిKkkotha 01:47, 31 అక్టోబర్ 2008 (UTC), తణుకు మీసమీక్షలు ఎంతో బాధ్యతగా వుంటాయి. ావి సమాజంపట్లా, సాహిత్యంపట్లా మీకుగల నిబద్ధతను తెలియచేస్తాయి. అందుకే నాకు చాల యిష్టం. -నిర్మలానంద, ప్రజాసాహితి,

‘కొనగోటిమీద జీవితం’ అనే ఇటీవలి నా కవితా సంపుటిని రెండుపుటల్లో సర్వాంగీణంగా సమీక్షించాడు అదృష్టదీపక్. ప్రచురించిన మీకు నా కృతజ్ఞతలు! -డా. సి.నారాయణరెడ్డి, హైదరాబాదు

.....................

అదృష్టదీపక్ రాసిన శ్రీశ్రీ జ్ఞాపకాలు అభిమానుల్ని ఉద్వేగానికి గురిచేశాయి. -జి. సుబ్బారావు, కొత్తపేట ..................

గురజాడమీద దాడిచేసినవారిమీద అదృష్టదీపక్ చేసిన విమర్శ అర్ధవంతంగా, నిశితంగా, శాస్త్రీయంగాంది.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అనంతపురం

.........................

బి.వి.యస్. శాస్త్రి నాకు అదృష్టదీపక్ వల్ల పరిచయం అయ్యాడు. ఓ గంట అతనితో మాటాడిన తర్వాత గ్రహించాను అతనొక బంధించబడ్డ కల్లోలసముద్రమని. తెలుగు సాహిత్య వీధుల్లో వికసించి గుబాళించాల్సి వున్న సమయాన అర్ధాంతరంగా తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుని మనమధ్యనుంచి నిష్క్రమించాడు. వెళ్ళిపోయిన ప్రతిభావంతుడైన మిత్రుడికి ఈ నెల ‘దీపకరాగం’ విశిష్టనివాళి. -స్మైల్, రాజమండ్రి

..........................

దీపకరాగంలోని వస్తువైవిధ్యం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. సమాజంలోని అన్ని రంగాలలోనూ దిగజారిపోతున్న విలువలమీద అదృష్టదీపక్ దండయాత్ర చేస్తున్నాడు. భాష,సాహిత్యం,సినిమా, రాజకీయం- ఇలా విషయం గురించి ప్రస్తావించినా,నిర్మొహ మాటంగాముసుగులు తొలగించి కొరడాదెబ్బలు కొడుతున్నాడు.

-వి.వి. సుబ్బరాజు (రతన్ బాబు), కోలంక .....................

మీలాంటి వాళ్ళు ఎక్కువగా రాయకపోవడం వలన అభ్యుదయ సాహిత్యానికి ఎంతో అన్యాయం జరుగుతోంది. -కె.మధుసూదన్, ఆకాశవాణి, విశాఖపట్నం

..........................

అదృష్టదీపక్ ఫొటోలో చక్కగా నవ్వుతూ..ఈ పిల్లాడికి పెళ్ళయిందా? అనుకొనేంత బావుంటాడు. కాని రచనలు చూస్తే, అట్లకాడ గేస్ పొయ్యిమీద బాగా కాల్చి, చొక్కా విప్పించి వాతలు పెట్టినట్టు రాస్తాడు. ఆ వేడికి పేజీలు కాలిపోతున్నాయి.! -మొహమ్మద్ ఖాదర్ ఖాన్, రాజమండ్రి

.......................

అభ్యుదయ దీపక్ / కధనం జలపాత వేగం / కవనం అభ్యుదయయాగం ఆశయాల పందిరిలో / అదృష్టదీపక్ రాగం. -అశోక్ కుమార్,విజయవాడ