దెయ్యం (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దెయ్యం
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్‌గోపాల్ వ‌ర్మ
నిర్మాతరాజశేఖర్, న‌ట్టికుమార్‌
తారాగణంరాజ‌శేఖ‌ర్
స్వాతి దీక్షిత్
తనికెళ్ళ భరణి
ఆహుతి ప్రసాద్
ఛాయాగ్రహణంస‌తీష్ ముత్యాల
కూర్పుసత్య, అన్వర్
సంగీతండి.ఎస్‌.ఆర్
విడుదల తేదీ
2021 ఏప్రిల్ 16 (2021-04-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆర్జీవీ దెయ్యం 2021 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ముఖ్యపాత్రల్లో నటించారు. 2014లో మొదలు పెట్టిన ఈ సినిమాకు మొదట ‘ప‌ట్ట ప‌గ‌లు’ పేరు పెట్టారు, కొన్ని మార్పుల త‌ర్వాత ‘ఆర్జీవీ దెయ్యం’గా 2021, ఏప్రిల్ 16న విడుదలైంది.[1][2]ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో కలిపి 5 భాషల్లో ఒకేరోజు విడుదల చేశారు.

కథ[మార్చు]

మెకానిక్ శంకర్ (రాజశేఖర్) గారాల కూతురు విజ్జి (స్వాతి దీక్షిత్). అందరమ్మాయిల్లాగే కాలేజ్, ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు. అలాంటి విజ్జి ఉన్నట్లుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలెడుతుంది. మొదట ఇంట్లో వాళ్ళని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కొన్ని చెకప్స్ తర్వాత విజ్జికి దెయ్యం పట్టిందని తెలుస్తుంది. అసలు ఆ దెయ్యం ఎవరు? విజ్జి శరీరాన్ని ఎందుకు ఆవహించింది? ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం తండ్రి శంకర్ ఎన్ని ఇబ్బందులుపడ్డాడు? అనేది సినిమా కథ.[3]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. IB Times (7 April 2014). "Ram Gopal Varma's Horror Film 'Patta Pagalu' Trailer Released". Archived from the original on 2021-04-21. Retrieved 21 April 2021.
  2. Deccan Chronicle (7 April 2014). "First look of RGV's Patta Pagalu". Archived from the original on 2021-04-21. Retrieved 21 April 2021.
  3. Eenadu (16 April 2021). "Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం - rajasekhar and swathi deekshith deyyam movie review". Archived from the original on 2021-04-21. Retrieved 21 April 2021.