వేట

వికీపీడియా నుండి
(వేటగాడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Boar hunting, tacuinum sanitatis casanatensis (14th century)

వేట ప్రాచీనకాలంలో జీవనాధారమైన వృత్తి.

అనాది కాలంలో ఆహారం కోసం మాత్రమే వేటాడే మనిషి తర్వాత కాలంలో వినోదం కోసం లేదా వ్యాపారం కోసం జంతువులను, పక్షులను చంపడం ప్రారంభించాడు. ఇలా వేటాడే వ్యక్తిని వేటగాడు లేదా బోయవాడు అంటారు.

వేట మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగింది. జాలరి వాళ్ళు నదులు, సముద్ర జలాల్లో చేపలను ఆహారం కోసం వలల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది. సాధారణంగా జింకలను, పందులను మాంసం కోసం వృత్తి రీత్యా వేటాడుతారు. పులులు, సింహాలు, ఏనుగులను వినోదం కోసం వేటాడుతారు. ఏనుగులు చాలా బలమైన జంతువులు కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా కందకాలు త్రవ్వుతారు.

హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతంలో రాజులు వేటాడటం సాంప్రదాయంగా పేర్కొనడం జరిగింది. వేటాడటం లేదా మాంసం తినడం జైనమతంలో నిషేధం. ఎందుకంటే అన్ని జీవాలను సమానంగా చూడాలని జైనం ప్రభోదిస్తుంది. బౌద్ధంలో కూడే ఇదేరకమైన సాంప్రదాయం అమల్లో ఉంది.

న్యూజీలాండ్కు వేటకు సంబంధించి బలమైన చరిత్ర ఉంది. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ, వలసవాదుల పరిపాలనలో ఉన్నపుడు వేటను ఒక ఆటగా భావించేవాళ్ళు. ప్రతీ మహారాజు లేదా జమీందారు దగ్గర కొద్ది మంది వేటగాళ్ళు ఉండేవాళ్ళు. వీరిని షికారీలు అని పిలిచేవారు. వీరు జన్మత: వేటను వంటబట్టించుకున్న వాళ్ళు. వీళ్ళని మామూలుగా ప్రాంతీయంగా నివసించే కొన్ని తెగల నుండి ఎంచుకునేవారు. వీరికి వేటాడటంలో ఎన్నో సాంప్రదాయకమైన మెళుకువలు తెలిసి ఉండేవి.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వేట&oldid=4294969" నుండి వెలికితీశారు