ఒకరికి ఒకరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒకరికి ఒకరు
దర్శకత్వంరసూల్ ఎల్లోర్
రచనకోన వెంకట్
నిర్మాతకిరణ్
తారాగణంశ్రీరామ్,
ఆర్తీ ఛాబ్రియా,
బాలయ్య,
రాధా కుమారి,
తనికెళ్ళ భరణి,
హేమ,
బెనర్జీ,
విజయ్ సాయి
ఛాయాగ్రహణంసునీల్‌ రెడ్డి , రాజా
కూర్పుశంకర్
సంగీతంఎం.ఎం. కీరవాణి
పంపిణీదార్లుఆనంది ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
9 అక్టోబర్ 2003
సినిమా నిడివి
157 min.
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒకరికి ఒకరు 2003 లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ్, అర్తీ ఛాబ్రియా నాయకా నాయికలుగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం. ఛాయాచిత్రకుడు రసూల్ ఎల్లోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఎటువంటి హైప్, అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ ఇది విజయవంతమైంది. భారీ హిట్‌గా నిలిచిన ఆడియో సినిమా వసూళ్లకు బాగా ఉపయోగపడింది.

కథ[మార్చు]

కామేశ్వరరావు (శ్రీరామ్) మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు.కుటుంబ పరిస్థితి కారణంగా చిన్నతనం నుండి అన్ని విషయాలలో సర్దుకుపోవలసి వస్తుంటుంది. ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడు అయిన తరువాత బామ్మ (రాధా కుమారి) మొక్కు కారణంగా కాశీ వెళ్ళ వలసి వస్తుంది. దారిలో కథానాయకి స్వప్న (ఆర్తీ ఛాబ్రియా పరిచయమౌతుంది. ఇద్దరూ తమ అసలు పేర్లను దాచిపెట్టి రాహుల్, సుబ్బలక్ష్మిగా పరిచయమవుతారు. తమ ప్రేమను వ్యక్త పరుచుకోకుండానే విడిపోతారు. తరువాత స్వప్న అమెరికాలో ఉన్నట్లు తెలుసుకున్న కామేశ్, ఉద్యోగ నెపంతో ఆమెను వెతకడానికి అమెరికా వెళతాడు. తరువాత అతను స్వప్నను కలుసుకున్నాడా లేదా అన్నది తెర పైన చూడవలసిందే.

నటీ నటులు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు -- రసూల్ ఎల్లోర్

బయటి లింకులు[మార్చు]