Jump to content

విజయ్ సాయి

వికీపీడియా నుండి
విజయ్ సాయి
జననం
ఒంగోలు
మరణం2017 డిసెంబరు 11
యూసఫ్ గూడ, హైదరాబాదు
మరణ కారణంఆత్మహత్య
వృత్తినటుడు
జీవిత భాగస్వామివనిత[1]
పిల్లలుకుందన (కూతురు)
తల్లిదండ్రులు
  • సుబ్బారావు (తండ్రి)
  • లక్ష్మీ దేవి (తల్లి)

విజయ్ సాయి ఒక తెలుగు సినీ నటుడు.[2] హాస్యప్రధాన పాత్రలు ఎక్కువగా పోషించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

విజయ్ సాయి పూర్వీకులు మహారాష్ట్రకు చెందినవారు. తర్వాత వీరు ఒంగోలు లోని రంగుతోటకు వచ్చి స్థిరపడ్డారు. విజయ్ తల్లిదండ్రులు సుబ్బారావు, లక్ష్మీ దేవి. పదో తరగతి వరకు విజయ్ అక్కడే చదివాడు. విజయ్ వేదికలపై బ్రేక్ డ్యాన్సులతో అలరించేవాడు. కుమారుని హీరోగా చూడాలనే తలంపుతో తండ్రి హైదరాబాదులో స్థిరపడ్డాడు. విజయ్ కు వనిత అనే ఆమెతో వివాహం అయిన తర్వాత ఓ పాప కుందన జన్మించింది. తర్వాత దంపతులిద్దరూ విడిపోయారు. విడాకుల అనంతరం పాప తల్లి సమక్షంలోనే ఉంది. పాపను చూసేందుకు భార్య అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.[3]

సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

2017 డిసెంబరు 11 సోమవారం హైదరాబాదులోని యూసఫ్ గూడ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.[4] ఆత్మహత్యకు ముందు విజయ్ తన సెల్ ఫోనులో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో పరువు, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆరోపించాడు. వీరంతా తనను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు.[1]

విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ భార్య వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ లపై కేసు నమోదు చేశారు.[5] వీరిని అరెస్టు చేయడానికి వెళ్ళగా పరారయ్యారని 2017 డిసెంబరు 15 న పోలీసులు తెలిపారు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 11 డిసెంబరు 2017. Retrieved 11 డిసెంబరు 2017.
  2. "హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 11 డిసెంబరు 2017. Retrieved 11 డిసెంబరు 2017.
  3. "హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 14 డిసెంబరు 2017. Retrieved 11 December 2017.
  4. "Telugu Comedian Vijay Sai Dead, Suicide!". cinejosh.com. Retrieved 11 December 2017.
  5. "విజయ్‌ భార్యపై కేసు నమోదు". eenadu.net. హైదరాబాదు. Archived from the original on 11 డిసెంబరు 2017. Retrieved 11 డిసెంబరు 2017.
  6. "సినీనటుడి ఆత్మహత్య కేసులోని నిందితుల పరారీ". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 డిసెంబరు 2017. Retrieved 15 డిసెంబరు 2017.