Jump to content

మాయాజాలం (2006 సినిమా)

వికీపీడియా నుండి
(మాయాజాలం నుండి దారిమార్పు చెందింది)
మాయాజాలం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణం ఆర్.ఆర్.వెంకట్
కె అచ్చిరెడ్డి
తారాగణం శ్రీకాంత్
పూనమ్ కౌర్
ఆలీ
తనికెళ్ళ భరణి
బ్రహ్మానందం
గీతాంజలి
గుండు హనుమంతరావు
జ్యోతి
హేమ
అశోక్ కుమార్
ఛాయాగ్రహణం సి.విజయ్ కుమాఅర్
కూర్పు కె.వి. కృష్ణారెడ్డి
విడుదల తేదీ 2006 మే 12
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మాయాజాలం 2006 మే 12 న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని హిందీ లోకి నయాశూర్‌వీర్ పేరుతో అనువదించారు.

వంశీ ( శ్రీకాంత్ ) పెళ్ళిళ్ళ బ్రోకరు. అతను పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటాడు -సంబంధం వెతకడం నుండి వధువును అత్తగారి ఇంటికి పంపడం వరకు. అతని సోదరుడు ( రవి ప్రకాష్ ) నిజాయితీగల పోలీసు అధికారి. రోగుల అవయవాలతో వర్తకం చేసే ఒక వైద్యుడు ( షయాజీ షిండే ), సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమాని తన కుమార్తె స్వాతి ( దీపా ) ను ఎంపీ ప్రదీప్ ( ప్రదీప్ రావత్ ) కుమారుడు చత్రపతి ( షఫీ ) తో కుదుర్చుకుంటాడు. ఆ పెళ్ళికి వంశీయే పెళ్ళిళ్ళ పేరయ్య. కానీ స్వాతి పొరపాటున వంశీ ఫోటోను అందుకుంటుంది. వంశీనే తన కాబోయే భర్తగా పరిగణిస్తుంది.

ప్రదీప్ దురాగతాలకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్న వంశీ సోదరుడిపై దాడి చేసి పట్టుకుంటాడు. ఎంపి బాధితులు, వైద్యుడికి బలైపోయిన బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, కృష్ణ భగవాన్లు దయ్యాలవుతారు.

ఆ నాలుగు ప్రేతాత్మలు డాక్టర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం, వంశీ తన సోదరుడిని రక్షించుకోవడం, స్వాతి వంశీని పెళ్ళి చేసుకోవడం మిగతా కథలోని భాగాలు

పాటల జాబితా

[మార్చు]

అబ్బాయి , గానం: కుషి మురళీధర్ , సుమంగళి

రింగినగక్క , గానం: ఎస్ పి ఈశ్వర్, టినాకమల్

ఇఫ్ యూ వాంట్ , గానం: గంగ , సాగర్

హాట్ సమ్మర్, గానం: దేవీశ్రీ ప్రసాద్

తెలీయగ , రచన: కౌండిన్య , సంకృతి .

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]