Jump to content

సాయాజీ షిండే

వికీపీడియా నుండి
(సయాజీ షిండే నుండి దారిమార్పు చెందింది)
సాయాజీ షిండే
జననం
సతారా జిల్లా, మహారాష్ట్ర
వృత్తినటుడు, సినీ నిర్మాత
వెబ్‌సైటుhttp://www.sayajishinde.com/

సాయాజీ షిండే ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను జన్మతః మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.[1]

నేపథ్యము

[మార్చు]

షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ తరువాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగా అలవాటు చేసుకుని దేహధారుడ్యాన్ని పెంపొందించుకున్నాడు. నటన గురించి తెలుసుకోవడానికి ఎందరితోనో మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్‌స్టేషన్ సమీపంలో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని నాట్యశాస్త్ర పుస్తకాన్ని చదివాడు. అభినయ సాధన్లాంటి మరాఠీ పుస్తకాల నుంచి కూడా నోట్స్ తయారు చేసుకునేవాడు.[2]

నట జీవితము

[మార్చు]

ధార్మియ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. చాలామంది షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు. దాంతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యాడు. ఠాగూర్ సినిమాలో బద్రీ నారాయణ, వీడే సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు మొదట్లో అతనికి పేరు తెచ్చిన పాత్రలు.[2]

తెలుగు

[మార్చు]
చిత్రము సంవత్సరము పాత్ర పేరు
ఫియర్ 2024
మా నాన్న సూపర్‌హీరో 2024
డబుల్ ఇస్మార్ట్ 2024
ఏజెంట్ నరసింహ 117 2023
దహనం 2022 వెబ్ సిరీస్
కోతల రాయుడు 2022
పల్లె గూటికి పండగొచ్చింది 2022
ఫోకస్ 2022
తెలంగాణ దేవుడు 2021
సాఫ్ట్‌వేర్ సుధీర్[3] 2019
రూలర్[4] 2019
ఇస్మార్ట్ శంకర్[5] 2019
శరభ[6] 2018
అమర్ అక్బర్ ఆంటోని 2018
అవంతిక 2017
ఏంజెల్ 2017
2 కంట్రీస్ 2017
సప్తగిరి ఎక్స్‌ప్రెస్[7] 2016
డిక్టేటర్ 2016
సూర్య వర్సెస్ సూర్య 2015 హీరోయిన్ తండ్రి
1 - నేనొక్కడినే 2014 ఇన్‍స్పెక్టర్
బసంతి 2014 సిటీ పోలీస్ కమీషనర్
యమలీల 2 2014
జోరు[8] 2014 (ఎమ్మెల్మే సదాశివన్/ను తండ్రి (ద్విపాత్రాభినయం)
షాడో (2013 సినిమా) 2013 కమీషనర్ ఆఫ్ పోలీస్
బాద్‍షా 2013 పోలీస్
జబర్‌దస్త్ 2013 బీహార్ యాదవ్
సుడిగాడు 2012 ప్రియ తండ్రి
సీమ టపాకాయ్ 2012 గురజాడ కృష్ణమూర్తి
యముడికి మొగుడు (2012 సినిమా) 2012 యముడు
తూనీగ తూనీగ 2012
ఎందుకంటే...ప్రేమంట! 2012 రాము తండ్రి
దరువు 2012 సూపర్ స్టార్ బలరాం
బిజినెస్ మేన్ 2012 లాలు
ఊసరవెల్లి 2011 టోనీ తండ్రి
దూకుడు 2011 మేకా నరసింగరావ్
మిస్టర్ పర్‌ఫెక్ట్ 2011
శక్తి 2011 శివాజీ
డాన్ శీను 2010 శక్తినాధ్
అదుర్స్ 2010 పోలీస్ ఇన్‌స్పెక్టర్
ఆర్య 2 2009
కిక్ 2009
సత్యమేవ జయతే 2009
బంపర్ ఆఫర్ 2009
రాత్రి 2009
అరుంధతి 2009 అన్వర్
నేనింతే 2008 సినీ నిర్మాత
కింగ్ 2008 గోపీ మోహన్ (కింగ్ మామ)
చింతకాయల రవి 2008 లావణ్య తండ్రి
సవాల్ 2008
జాన్ అప్పారావు 40+ 2008
కృష్ణ 2008 షిండే
మైసమ్మ ఐ.పి.ఎస్. 2007 మంత్రి సాధూ
చిరుత 2007 జైలర్
శంకర్‌దాదా జిందాబాద్ 2007 రాజలింగం
టక్కరి 2007 గురు
దుబాయ్ శీను 2007 బాబ్జీ
లక్ష్మీ కళ్యాణం 2007 ప్రెసిడెంట్
శ్రీమహాలక్ష్మి 2007 ప్రతినాయకుడు
గొడవ 2007 ప్రతినాయకుడు
రాఖీ 2006
బాస్ 2006 ఎస్. ఆర్. కె
వీరభద్ర 2006 పెద్దిరాజు
పోకిరి 2006 పోలీస్ కమీషనర్ ఖాదర్
లక్ష్మి 2006 జనార్ధన్
దేవదాసు 2006 కాటమరాజు
ఆంధ్రుడు 2005
సూపర్ 2005 ఇన్‌స్పెక్టర్
అతడు 2005 శివారెడ్డి
గుడుంబా శంకర్ 2004 బెజవాడ నారాయణ
ఆంధ్రావాలా[9] 2004 బడేమియా
వీడే 2003 బైరాగి నాయుడు
ఠాగూర్ 2003 బద్రీనారాయణ
సూరి 2001

వెబ్​సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే". EENADU. Retrieved 2024-04-12.
  2. 2.0 2.1 విలేకరి (9 October 2016). ఆదివారం సాక్షి: ఈ బత్తుల బైరాగినాయుడి జోలికి వస్తే... హైదరాబాదు: జగతి ప్రచురణలు. p. 14. Retrieved 12 October 2016.
  3. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Archived from the original on 26 అక్టోబరు 2019. Retrieved 7 November 2019.
  5. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
  6. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
  7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
  8. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  9. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.

బయటి లంకెలు

[మార్చు]