నేనింతే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనింతే
(2008 తెలుగు సినిమా)
Ravi Teja's Neninthe poster.jpg
దర్శకత్వం పూరీ జగన్నాథ్
నిర్మాణం డి.వి.వి. దానయ్య
కథ పూరీ జగన్నాథ్
చిత్రానువాదం పూరీ జగన్నాథ్
తారాగణం రవితేజ, శియా గౌతమ్
సంగీతం చక్రి
సంభాషణలు పూరీ జగన్నాథ్
ఛాయాగ్రహణం శ్యామ్ కె. నాయుడు
కూర్పు వర్మ
నిర్మాణ సంస్థ యూనివర్సల్ మీడియా
విడుదల తేదీ 19 డిసెంబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నేనింతే 2008 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, శియా గౌతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.[1][2] సినీ పరిశ్రమలో ప్రవేశించాలనుకునే వారికి, అక్కడ వివిధ స్థాయిల్లో పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య ఈ కథ నడుస్తుంది.

చిత్ర కథ[మార్చు]

ఇడ్లీ విశ్వనాథ్ ఒక ప్రముఖ దర్శకుడు, ఇతడి క్రింద పనిచేసే అసిస్టెంట్లలో రవితేజ ఒకడు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఇతడు పనిచేసే చిత్రంలో హీరో హీరోయిన్ మధ్య డ్యాన్స్ షాట్ చిత్రీకరిస్తుంటారు. సమూహ నృత్యంలో ఒక నృత్యకారిణి (సంధ్య) డ్రెస్ విషయంలో అభ్యంతరం తెలుపుతుంది. తాను అర్థనగ్నమైన దుస్తులు వేసుకోనని కరాకండిగా చెపుతుంది. గత్యంతరం లేని పరిస్థితులలో డబ్బు అవసరమై చేస్తున్నానని రవికి చెబుతుంది. రవి సర్దిచెప్పిన తరువాత షూటింగులో పాల్గొంటుంది. ఈ చిత్ర నిర్మాణ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సంధ్య అక్క సురేఖ రాణి పలు చిత్రాలలో నర్సు వేషాలంకరణతో, నృత్యకారిణిగా చేస్తుంది. ఈమెను కృష్ణ భగవాన్ పెళ్ళి చేసుకుని ఆమె సంపాదనపై ఆధారపడుతూ మరదలి అందాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈమెను కూడా చిత్రాలలో నాట్యకారిణిగా చేర్పిస్తాడు.

రవి తల్లి రమాప్రభ, తన కొడుకు ఎప్పటికైనా దర్శకుడు కాకపోతాడా? వాడి పేరు వెండితెరపై చూడకపోతానా అని ఎదురుచూస్తూ అతడి కోసం రవి దర్శకుడు అనే పేరుతో ఒక బోర్డు ముందుగానే చేయించి ఆనందిస్తుంది. వీరుండే వీధిలో ఒక రౌడీ (సాయాజీ షిండే) చేసిన హత్యను చూసి సంధ్య పెద్దగా కేక పెడుతుంది. ఆమెను చూసిన రౌడీ ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు. రవి-సంధ్యల ప్రేమ వ్యవహారం తెలుసుకుని ఎలాగైనా రవిని తప్పించాలనుకుని సంధ్య బావ అయిన కృష్ణ భగవాన్ ను పావుగా వాడుకుని కుట్ర పన్నుతాడు. మరో వైపు దర్శకుడు కావాలనుకుంటున్న రవి కలలు ఫలించి దర్శకుడి అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో రవి తల్లి అనారోగ్యానికి పాలయి ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ సోకిందనే విషయం తెలుసుకుంటుంది. అయితే ఈ విషయాన్ని చెప్పి కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక తనలోనే దాచుకుంటుంది.

క్లైమాక్సులో తాను దర్శకత్వం వహించిన చిత్రంలో తన పేరు లేకపోవడంతో రవి షాక్ తింటాడు. ఇదంతా చిత్రానికి నిర్మాత అయిన రౌడీ పనేనని తెలుసుకుని, అందుకు అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తు వేసి రౌడీని చిత్తు చేసి సినిమా విడుదల చేస్తారు. దర్శకుడిగా మంచి విజయం సాధిస్తాడు. సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా మాకు సినిమాలు తప్ప ఇంకేమీ రాదని డైలాగ్ తో సినిమా ముగుస్తుంది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా

మూలాలు[మార్చు]

  1. "Neninthe Movie Review". timesofindia.indiatimes.com. Retrieved 15 March 2018.
  2. "Neninthe review". idlebrain.com. Retrieved 15 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=నేనింతే&oldid=3503157" నుండి వెలికితీశారు