చింతకాయల రవి
Appearance
చింతకాయల రవి యోగి దర్శకత్వంలో 2008లో విడుదలైన సినిమా. వెంకటేష్, అనుష్క ఇందులో ప్రధాన పాత్ర ధారులు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
చింతకాయల రవి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యోగి |
---|---|
నిర్మాణం | నల్లమలపు శ్రీనివాస్ |
చిత్రానువాదం | కోన వెంకట్ |
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్ అనుష్క శెట్టి అజయ్ ఆలీ (నటుడు) రఘుబాబు బ్రహ్మానందం చంద్రమోహన్ సాయాజీ షిండే |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2 అక్టోబర్ 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
[మార్చు]చింతకాయల రవి (వెంకటేష్) సాఫ్టువేర్ ఇంజనీరు అవుదామని అమెరికా వెళ్ళి అది కుదరకపోవడంతో అక్కడే సైబర్ వేవ్ అనే బార్ లో పనిచేస్తుంటాడు. కానీ రవి అమ్మ శేషుమాంబ (లక్ష్మి) మాత్రం ఊళ్ళో వాళ్ళందరికీ తన కొడుకు గురించి గొప్పగా చెబుతుంటుంది. ఆమె తమ్ముడు (ఎం. ఎస్. నారాయణ)కు రవికి పెళ్ళి సంబంధాలు చూడమని చెబుతుంటుంది.
నటవర్గం
[మార్చు]- చింతకాయల రవి గా వెంకటేష్
- సునీత గా అనుష్క
- మావిడికాయల లావణ్య గా మమతా మోహన్ దాస్
- చింతకాయల శేషుమాంబ గా లక్ష్మి
- చింతకాయల గోవిందరావు గా చంద్రమోహన్
- ఆంజనేయులు గా ఎం. ఎస్. నారాయణ
- మావిడికాయల రామచంద్రరావు గా శాయాజీ షిండే
- సునీత తండ్రి గా చలపతి రావు
- పెందుర్తి బాబు గా సునీల్
- అజయ్ గా అజయ్
- లచ్చిమి గా ఆలీ
- సాయి గా వేణుమాధవ్
- పింకీ గా బ్రహ్మానందం
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- శ్రీకాంత్ గా వేణు
- రఘుబాబు
- మాస్టర్ భరత్
- శ్రీనివాస రెడ్డి
- రవికాంత్
- బండ్ల గణేష్
- సత్యం రాజేష్
- రాజీవ్ కనకాల
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]- బాగుందే బాగుందే, విజయ్ ప్రకాష్ , హాంసిక అయ్యర్
- ఓ సునీతా , శంకర్ మహదేవన్
- షాబా షాబా భల్లే భల్లే , శంకర్ మహదేవన్, మహాలక్ష్మి అయ్యర్
- మెరుపులా , రాజేష్, శ్రేయా ఘోషల్
- ఎందుకో , సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్
- వల్ల వల్ల వల్లా బేబీ , కె. కె. సునిది చౌహాన్