బండ్ల గణేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండ్ల గణేష్
జననం
షాద్‌నగర్, మహబూబ్ నగర్ జిల్లా
వృత్తినటుడు, నిర్మాత
బండ్ల గణేష్ నిర్మాతగా.. నీజతగా.. నేనుండాలి

బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీనిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు. 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు.ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు.[1]

రాజకీయాలు

[మార్చు]

2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] కానీ టికెట్ దక్కలేదు.[3] ఏప్రిల్ 5, 2019 న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.[4]

నిర్మాతగా తీసిన చిత్రాలు

[మార్చు]

నటుడిగా

[మార్చు]

వివాదాలు

[మార్చు]

గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టే నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత వక్కంతం వంశీ ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి ఆరు నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.[8]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (25 June 2021). "MAA Election: వాళ్ల పనుల్ని వేలెత్తి చూపించం - bandla ganesh about prakash raj and maa elections". www.eenadu.net. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  2. Vasireddy, Amrutha (14 September 2018). "Tollywood producer Bandla Ganesh, TRS MLC Bhupathi Reddy joins Congress".
  3. Kavirayani, Suresh (12 December 2018). "Bandla Ganesh does the disappearing act". Deccan Chronicle.
  4. "రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై". 5 April 2019. Archived from the original on 5 April 2019.
  5. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  6. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  7. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  8. "Tollywood producer Bandla Ganesh booked under SC/ST Act by Hyd police". The News Minute. 12 January 2018. Archived from the original on 14 February 2019. Retrieved 12 March 2019.