తొట్టెంపూడి వేణు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొట్టెంపూడి వేణు
Venu Thottempudi.jpg
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వేణు
జననం
తొట్టెంపూడి వేణు

(1976-06-04) 1976 జూన్ 4 (వయసు 46)[1]
ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లువేణు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిఅనుపమా చౌదరి[2]

తొట్టెంపూడి వేణు ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.[3]

తొట్టెంపూడి వేణు గారు ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం పెరిదేపి గ్రామంలో జన్మించారు. పెరిగింది మాత్రం ఒంగోలు, విజయవాడ, మదురై లో. వేణు తండ్రి కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పూర్తి చేసి అధ్యపకుడిగా విజయవాడ, చెన్నై, మదురై లో పనిచేశారు. మదురై లోని ప్రముఖ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పని చేసి పదవీవిరమణ పొందారు. వేణు సోదరి చిన్నమ్మ గారు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకులు, ప్రస్తుత టి.ఆర్.ఎస్ నేత నామా నాగేశ్వరరావు సతీమణి. వేణు మదురై లో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసి కర్ణాటక లోని ధార్వాడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.

స్వయంవరం విజయం తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన వేణు గారు ఎక్కువగా తన సొంత బ్యానర్ ఎస్.పి ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. చిరునవ్వు తో, హనుమాన్ జుంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తరువాత మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వేణు కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగా, నిర్మాతగా, మాటల రచయిత గా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు. వేణు 2013 లో రామాచారి అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా తరువాత బిజినెస్ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. 9 ఏళ్ళ తర్వాత 2022 లో రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు అనే చిత్రంలో నటించాడు.[4] వేణు గారి భార్య అనుపమ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.బి.ఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరమని ఆహ్వానించి న కుటుంబ భాద్యతలకే తన ప్రాధాన్యత ఇస్తూ వేణు గారి చిత్ర నిర్మాణ సంస్థ ఎస్.పి ఎంటర్టైన్మెంట్స్ కు మార్కెట్ హెడ్ గా పనిచేశారు.[5]


నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర సహ నటులు దర్శకుడు గమనిక
1999 స్వయంవరం వేణు లయ కె. విజయ భాస్కర్ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
2000 మనసుపడ్డాను కానీ వేణు రమ్యకృష్ణ, రాశి కె.వీరు
2000 చిరునవ్వుతో వేణు షహీన్ ఖాన్ జి. రాంప్రసాద్
2001 వీడెక్కడి మొగుడండీ? వేణు శృతి రాజ్, గీతు మోహన్ దాస్ ఇ.వి.వి.సత్యనారాయణ
2000 దుర్గ ప్రతాప్ రోజా ఆర్.కె. సెల్వమణి
2000 పొట్టు అమ్మన్ ప్రతాప్ రోజా కె.రాజరత్నం
2001 హనుమాన్ జంక్షన్ శతృ అర్జున్, జగపతి బాబు, లయ, స్నేహ, విజయ లక్ష్మి ఎం.రాజా
2002 ప్రియనేస్తమా సూర్య మాళవిక ఆర్. గణపతి
2002 మళ్ళీ మళ్ళీ చూడాలి పవన్ జనని పవన్స్ శ్రీధర్
2003 కళ్యాణ రాముడు కల్యాణ రాముడు ప్రభుదేవా, నిఖిత జి. రాంప్రసాద్
2003 పెళ్ళాం ఊరెళితే సుబ్బు రక్షిత, సంగీత, శ్రీకాంత్ ఎస్వీ క్రిష్ణారెడ్డి
2003 పెళ్ళాంతో పనేంటి మధు లయ, కల్యాణి ఎస్. వి. కృష్ణారెడ్డి
2004 ఖుషీ ఖుషీగా శ్రీకుమార్ జగపతి బాబు, రమ్యకృష్ణ, నిఖిత, సంగీత జి. రాంప్రసాద్
2004 చెప్పవే చిరుగాలి వేణు ఆషిమా భల్లా, అభిరామి విక్రమన్
2005 సదా మీ సేవలో తిలక్ శ్రీయ నీలకంఠ
2006 ఇల్లాలు ప్రియురాలు వేణు దివ్య ఉన్ని భాను శంకర్
2006 శ్రీకృష్ణ 2006 వెంకటేశ్వర్లు గౌరి ముంజల్, శ్రీకాంత్ విజయేంద్ర ప్రసాద్
2007 బహుమతి వెంకటరమణ సంగీత ఎస్వీ క్రిష్ణారెడ్డి
2007 అల్లరే అల్లరి ఆనంద్ అల్లరి నరేష్, పార్వతి మెల్టన్ ముప్పలనేని శివ
2007 యమగోల మళ్ళీ మొదలైంది జూనియర్ చిత్రగుప్త శ్రీకాంత్, మీరా జాస్మిన్, రీమా సేన్ శ్రీనివాస రెడ్డి
2008 దీపావళి వేణు ఆర్తి అగర్వాల్, మేఘ నాయర్ హరిబాబు
2008 చింతకాయల రవి రవి స్నేహితుడు వెంకటేష్, అనుష్క యోగి
2009 గోపి గోపిక గోదావరి గోపి కమలినీ ముఖర్జీ వంశీ
2011 మాయగాడు లీలాకృష్ణ చార్మి దిలీప్ పోలన్
2012 దమ్ము ఎన్టీఆర్ బావ ఎన్టీఆర్, త్రిష, కార్తీక బోయపాటి శ్రీను
2012 రామాచారి రామాచారి కమలినీ ముఖర్జీ, ఆలీ, రఘు బాబు ఈశ్వర్
2021 రామారావు ఆన్‌ డ్యూటీ

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (3 June 2021). "వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ?". Namasthe Telangana. Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
  2. "Welcome to Corner House". www.flyingelephant.co.uk. Retrieved 2022-07-07.
  3. HMTV (29 July 2021). "8 ఏళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న వేణు". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  4. "Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి". EENADU. Retrieved 2022-07-07.
  5. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21