కళ్యాణ రాముడు (2003 సినిమా)
కళ్యాణ రాముడు | |
---|---|
దర్శకత్వం | జి. రాంప్రసాద్ |
కథ | జెన్నీ |
నిర్మాత | వెంకట శ్యాం ప్రసాద్ |
తారాగణం | తొట్టెంపూడి వేణు నిఖిత ప్రభుదేవా |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 18 జూలై 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కళ్యాణ రాముడు 2003 లో జి. రాంప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో వేణు, నిఖిత ప్రధాన పాత్రలు పోషించారు. సుమన్, నాజర్, ప్రభు దేవా, రాజా రవీంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.
కథ
[మార్చు]రాము (వేణు) పెళ్ళిళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే ఒక వెడ్డింగ్ ప్లానర్. కళ్యాణ మండపం నిర్మించడం దగ్గర్నుంచి మండపాన్ని అలంకరించడం, సంగీత విభావరులు ఏర్పాటు చేయడం, వంటలు వండటం లాంటి అన్ని పనులూ చూస్తుంటాడు. అలా అతను ఏర్పాట్లు చేస్తున్న ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకు తన కిష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి పారిపోతాడు. పెళ్ళి కూతురు మాటలు రాని అమ్మాయి. దాంతో వాళ్ళ బంధువుల్లో కూడా ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అప్పుడు రాము ముందుకు వచ్చి డాక్టరైన తన అన్నను (రాజా రవీంద్ర) ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునేలా ఒప్పిస్తాడు. అదే సమయంలో పెళ్ళి కూతురు చెల్లెలు కళ్యాణి (నిఖిత) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది కానీ అతన్ని ఆటపట్టించడం కోసం తన బావయైన రాజేష్ (ప్రభుదేవా) ను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. ఆమెను మనస్ఫూరిగా ప్రేమించిన రాము రాజేష్ ను ఏదో విధంగా దూరం చేయాలని రకరకాలుగా ప్రయత్నించి భంగపడుతుంటాడు. వాళ్ళిద్దది ప్రేమను గురించి తెలుసుకున్న రాజేష్ అసలు విషయం చెప్పడంతో రాము ఊపిరి పీల్చుకుంటాడు.
అందరూ కలిసి రాము కల్యాణి పెళ్ళిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో కల్యాణి అక్క అకస్మాత్తుగా మరణిస్తుంది. ఒక జ్యోతిష్కుడు రాము కుటుంబానికి ఓ శాపం ఉందనీ, అందువల్ల ఆ ఇంట్లోకి కోడలుగా వెళ్ళిన వాళ్ళు చిన్న వయసులోనే చనిపోతున్నారని చెబుతాడు. దాంతో కల్యాణి తండ్రి తన కూతుర్ని రాముకిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. చివరికి రాము ఆయన్ను ఒప్పించి కల్యాణి ఎలా పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.
తారాగణం
[మార్చు]- తొట్టెంపూడి వేణు
- నిఖిత
- సుమన్
- నాజర్
- ప్రభుదేవా
- అల్లు రామలింగయ్య
- సునీల్
- రాజా రవీంద్ర
- ఎమ్మెస్ నారాయణ
- లక్ష్మీపతి
- రఘుబాబు
- సన
- గిరిధర్
- ఆర్.సుబ్బలక్ష్మి
పాటలు
[మార్చు]మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్నందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, సాయి శ్రీహర్ష, విజయ్ కుమార్ సాహిత్యాన్నందించారు. కె. జె. యేసుదాసు, శంకర్ మహదేవన్, మనో, ఉదిత్ నారాయణ్, కల్పన తదితరులు గానం చేశారు.
సంఖ్య | పాట | రచయిత | పాడినవారు | గమనికలు | |
---|---|---|---|---|---|
1 | "డోలు బాజా సన్నాయి" | విజయ్ కుమార్ | మనో | ||
2 | "వినవే చెలీ" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | శంకర్ మహదేవన్ | ||
3 | "గుత్తొంకాయ గుత్తొంకాయ" | చంద్రబోస్ (రచయిత) | శంకర్ మహదేవన్, సుజాత మోహన్ | ||
4 | "కథలో రాజకుమారుడు" | సాయి శ్రీహర్ష | కె. జె. యేసుదాసు | ||
5 | "ప్రేమించుకున్న వాళ్ళు" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, కల్పన | ||
6 | "సీతాకోకమ్మ నా రంగుల మొలకమ్మ" | చంద్రబోస్ | ఎస్. పి. చరణ్, శంకర్ మహదేవన్ |
మూలాలు
[మార్చు]- ↑ "ఐడిల్ బ్రెయిన్ లో కళ్యాణ రాముడు చిత్ర సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 16 November 2016.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- 2003 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- వేణు నటించిన సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- నాజర్ నటించిన సినిమాలు
- ప్రభుదేవా నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- తెలుగు హాస్య సినిమాలు
- హాస్య భరితమైన సినిమాలు
- 2003 తెలుగు సినిమాలు