రామాచారి (2013 సినిమా)
స్వరూపం
రామాచారి | |
---|---|
దర్శకత్వం | జి.ఈశ్వర్‌రెడ్డి |
కథ | ఉదయకృష్ణ, సీబీ.కె.థామస్ |
నిర్మాత | పి.వి.శ్యాంప్రసాద్ |
తారాగణం | తొట్టెంపూడి వేణు కమలిని ముఖర్జీ బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | కె.ప్రసాద్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఎస్.పి. ఎంటర్ టైన్ మెంట్ |
విడుదల తేదీ | 17 మే 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రామాచారి 2013లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి.ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 17 మే 2013న విడుదలైంది.
కథ
[మార్చు]చిన్నప్పటి నుండి పోలీసు ఆఫీసర్ కావాలని వేణు (రామాచారి ) కి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి పోలీస్ ఆఫర్ కాలేక పోతాడు. కానీ ఏదో విధంగా పోలీసులకు సహాయ పడాలనే ఉద్దేశ్యంతో గూఢాచారిగా మారి వారికి సహాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఒకసారి ముఖ్యమంత్రి హరిశ్చంద్రప్రసాద్ (బాలయ్య) ని చంపడానికి ప్లాన్ వేశారన్న సమాచారం తెలుసుకొని, ఎలాగైనా సీఎం ని కాపాడాలని అనుకుంటాడు ? మరి సీఎం ని కాపాడటానికి ఆయన ఏం చేస్తాడు ? చివరికి ముఖ్యమంత్రిని కాపాడగలిగాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
[మార్చు]- తొట్టెంపూడి వేణు - రామాచారి
- కమలిని ముఖర్జీ
- బ్రహ్మానందం - చింత
- బాలయ్య - హరిశ్చంద్రప్రసాద్, ముఖ్యమంత్రి
- మురళి శర్మ - పోలీసు కమీషనర్ చడ్డ
- ఆలీ - గంగూలీ
- చంద్రమోహన్
- గిరిబాబు
- ఎల్.బి.శ్రీరామ్
- రఘుబాబు
- సుత్తివేలు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
- దర్శకుడు: జి.ఈశ్వర్‌రెడ్డి
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం:కె.ప్రసాద్
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
- ఫైట్ మాస్టర్ : సతీష్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి
విశ్వ
వెన్నెలకంటి - కథ: ఉదయకృష్ణ, సీబీ.కె.థామస్
- ఆర్ట్: కుషాల్ శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ 123 Telugu (17 May 2013). "సమీక్ష : రామాచారి – ఈ గూడచారి పాతవాడే |". Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (17 May 2013). "Ramachari Movie Review {3/5}: Critic Review of Ramachari by Times of India". Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.