Jump to content

దివ్య ఉన్ని

వికీపీడియా నుండి
దివ్యా ఉన్ని
జననం
జాతీయతఅమెరికన్
వృత్తినటి, భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు
క్రియాశీల సంవత్సరాలు1987 - 2019
పిల్లలు3
బంధువులు

దివ్యా ఉన్ని భారతీయ నటి, భారతీయ సంతతికి చెందిన శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం వంటి వివిధ రకాల నృత్యాలను ఔత్సాహికులకు శిక్షణ ఇస్తుంది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

దివ్య ఉన్ని కేరళలోని కొచ్చిలో పొన్నెత్మాధాతిల్ ఉన్నికృష్ణన్, కిజ్కేమధాటిల్ ఉమా దేవి దంపతులకు జన్మించింది. ఆమె తల్లి సంస్కృత ఉపాధ్యాయురాలు. గిరినగర్‌లోని భవన్ విద్యా మందిర్ లో సంస్కృత విభాగానికి అధిపతి అయినా ఉమా దేవి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా 2013లో జాతీయ అవార్డును అందుకుంది.[1][2]

దివ్య ఉన్ని పాఠశాల విద్యను గిరినగర్‌లోని భవన్‌ విద్యా మందిర్‌లో పూర్తి చేసింది. తరువాత ఆమె ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాల నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

టీవీ / సినిమా

[మార్చు]

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించింది. రెండవ తరగతి చదువుతున్నప్పుడు ఆమె బాలనటిగా నీయేత్ర ధన్య (1987) చిత్రంలో నటించింది. దాని తర్వాత కమల్ దర్శకత్వం వహించిన పూక్కలం వరవాయి (1991), ఓ ఫాబి (1993) చిత్రాలతో పేరుతెచ్చుకుంది. ఆమె వినయన్ దర్శకత్వం వహించిన ఇనియోన్ను విశ్రమిక్కట్టే అనే టీవీ సీరియల్ కూడా చేసింది.

పద్నాలుగేళ్ల వయసులో పదో తరగతి చదువుతూనే ఆమె ప్రధాన నటిగా నటించిన మొదటి చలన చిత్రం కల్యాణ సౌగంధికం (1996). ఇందులో దిలీప్, కళాభవన్ మణి వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు- తదనంతరం, ఆమె నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్ గోపి, జయరామ్.. ఇలా ప్రముఖులతో పలు చిత్రాల్లో నటించింది.

నృత్యం

[మార్చు]

దివ్య ఉన్ని తన మూడు సంవత్సరాల వయస్సులో భరతనాట్యం నృత్య శిక్షణను ప్రారంభించింది, ఆ తర్వాత ఆమె కూచిపూడి, మోహినియాట్టంలో శిక్షణ పొందింది.[3] ఆమె 1990, 1991లలో కేరళ స్కూల్ కలోల్సవం రాష్ట్రవ్యాప్త పోటీలలో ''కళతిలకం'' కిరీటాన్ని పొందింది. భారతదేశపు ప్రీమియర్ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్‌లో, ఆమె భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం, భారతీయ జానపద నృత్యం వంటి వివిధ భారతీయ నృత్య కళారూపాలను ప్రదర్శించింది. ఆమె దేశంలో వివిధ భారతీయ నృత్య ఉత్సవాలతో పాటు[4][5][6][7][8] ఉత్తర అమెరికా, యూరప్, పర్షియన్ గల్ఫ్ దేశాల అంతటా అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూనే ఉంది.

ఆమె అరవిందాక్ష స్మారక అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది. పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నంలో, ఆమె ప్రస్తుతం తాను నివసిస్తున్న యునైటెడ్ స్టేట్స్‌లోని చిన్న పిల్లల కళాత్మక ప్రతిభను అభివృద్ధి చేస్తోంది. ఈ లక్ష్యంతో, ఆమె ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని శ్రీపాదం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.

వ్యక్తిగతం

[మార్చు]

ఆమెకు ఒక సోదరి ఉంది, విద్యా ఉన్ని, ఆమె రెండు మలయాళ సినిమాలలో కథానాయికగా నటించింది. అలాగే దివ్య ఉన్ని మలయాళ నటి మీరా నందన్, రమ్య నంబీశన్‌లకు కజిన్.

మూలాలు

[మార్చు]
  1. "National award for Sanskrit teacher Ms. Umadevi K. Ms. Umadevi K. Sanskrit teacher bagged the national Award for Best Teacher 2013 instituted by MHRD, New Delhi. She was invited to attend the award ceremony at New Delhi on Teachers Day". bhavans.info/news/show_other_news.asp?nid=774&kid=32 (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 23 అక్టోబరు 2017. Retrieved 1 April 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "List of teachers who were awarded National Award on Teachers Day 2014 | Curriculum Magazine". www.curriculum-magazine.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 27 May 2017.
  3. "Reinventing the Panchakanya Women Through Bharatanatyam". Brown Girl Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). 6 January 2017. Archived from the original on 20 డిసెంబరు 2019. Retrieved 27 May 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. M, Athira (9 November 2017). "Artistic endeavours". The Hindu.
  5. "A lifelong passion for dance". 9 November 2017.
  6. "Divya Unni back on stage with mesmerizing dance steps - Video".
  7. Nampoothiri, Hareesh N. (16 November 2017). "Review: Young dancers take the stage at Soorya's 'Parampara' festival". The Hindu.
  8. "Review - The flavors of a festival - Padma Jayaraj". narthaki.com.