కళాభవన్ మణి
కళాభవన్ మణి Kalabhavan Mani | |
---|---|
2010 లో కళాభవన్ మణి | |
జననం | మణి రామన్ చెనతునాడ్ కున్నిస్సెరి వీట్టిల్ 1 జనవరి 1971 |
మరణం | 6 మార్చి 2016[1] కొచ్చి, కేరళ, భారతదేశం | (వయస్సు 45)
వృత్తి | సినిమా నటుడు, నేపధ్యగాయకుడు, సంగీత దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1995 – 2016 |
జీవిత భాగస్వాములు | నిమ్మీ (m.2000-2016) |
పిల్లలు | శ్రీలక్ష్మీ |
తల్లిదండ్రులు | చెనతుండ్ కున్నిస్సెరి వీటిల్ రామన్ అమ్మిని రామన్ |
వెబ్‌సైటు | www |
మణిరామన్ (జనవరి 1, 1971 - మార్చి 6, 2016) భారతీయ సినిమా నటుడు, గాయకుడు. ఆయన కళాభవన్ మణి గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించాడు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించాడు. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని పాత్రలకు పోషించాడు. ఆయనకు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డు, కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు 1000 లో వచ్చాయి.[2][3] ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాదించాడు. దాదాపు దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన కేరళరాష్ట్రం లోని చలకుడిలో జనవరి 1 1971లో జన్మించాడు. "కళాభవన్" నాటక సంస్థ ద్వారా మిమిక్రీ కళాకారునిగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు.[4] ఆయన మలయాళ చిత్రం "అక్షరం" ద్వారా చిత్రరంగంలో ప్రవేశించాడు.
ఆయన సుమారు 200 కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. ఆయన అనేక చిత్రాలలో హాస్యనటుడిగా నటించారు. ఆయన యొక్క మొదతి ఆల్బం కన్నిమంగ ప్రయతిల్. జెమిని చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్ తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్ గా, విలన్ గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మలయాళ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయన 2000 సెప్టెంబరు 22 లో వెటర్నరీ వైద్యురాలైన డా. నిమ్మీని వివాహమాడారు. ఆయనకు శ్రీలక్ష్మీ అనే కుమార్తె ఉంది.[5] ఒకానొకప్పుడు ఆయన చలకుడిలో ఆటోరిక్షా డ్రైవరుగా ఉండేవారు.[6]
తెలుగు సినిమాలు[మార్చు]
- ఎవడైతే నాకేంటి (2007)
- నరసింహుడు (2005)
- అర్జున్ (2004)
- ఆయుధం (2003)
- జెమిని (2002)
మరణం[మార్చు]
ఆయన కాలేయం, మూత్రపిండాల వ్యాధితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 2016 మార్చి 6 న కోచీ లోని అమృతా హాస్పటల్ లో మరణించారు.[7]
మూలాలు[మార్చు]
- ↑ http://www.thehindu.com/entertainment/malayalam-actor-kalabhavan-mani-passes-away/article8320842.ece
- ↑ കലാഭവന് മണിക്ക് ഇത് എന്തുപറ്റി?. mangalam.com (9 October 2013). Retrieved on 2015-09-20.
- ↑ A Online Malayalam Cinema News Portal. Cinidiary. Retrieved on 20 September 2015.
- ↑ Sreedhar Pillai (25 April 2002). "Mani matters". The Hindu.
- ↑ മണി ഐശ്വര്യയുടെ നായകന് , Interview – Mathrubhumi Movies. mathrubhumi.com. 10 June 2010
- ↑ Mani matters. The Hindu (25 April 2002). Retrieved on 2015-09-20.
- ↑ "Malayalam actor Kalabhavan Mani passes away". ulaska (in ఇంగ్లీష్). Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-06.
ఇతర లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Kalabhavan Mani. |