కె. విజయ భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయ భాస్కర్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రార్థన ఆయన మొట్టమొదటి సినిమా. నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశాడు. ఆయన సినిమాలు చాలా వరకు హాస్య ప్రధానంగా సాగుతాయి.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఆయన పదో సంవత్సరంలో కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరాడు. [1] చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. 1979లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి అక్కడే ఏడేళ్ళపాటు పనిచేశాడు.

సినిమాలు[మార్చు]

 1. ప్రార్థన (1991)
 2. స్వయంవరం (1999)
 3. నువ్వే కావాలి (2000)
 4. నువ్వు నాకు నచ్చావ్ (2001)
 5. మన్మధుడు (2002)
 6. తుఝే మేరీ కసమ్ (2003)
 7. మల్లీశ్వరి (2004)
 8. జై చిరంజీవ (2005)
 9. క్లాస్ మేట్స్ (2007)
 10. భలే దొంగలు (2008)
 11. ప్రేమ కావాలి (2011)
 12. మసాలా (2013)

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. జీవి. "idlebrain". idlebrain.com. Idlebrain. Retrieved 16 June 2016.
 2. http://pib.nic.in/focus/foyr2001/fomar2001/fo270320012b.html

బయటి లింకులు[మార్చు]