Jump to content

నల్లమలపు శ్రీనివాస్

వికీపీడియా నుండి
నల్లమలపు శ్రీనివాస్
జననం
ఇతర పేర్లుబుజ్జి
వృత్తిసినీ నిర్మాత

నల్లమలపు శ్రీనివాస్ ఒక తెలుగు సినీ నిర్మాత. ఈయన్నే బుజ్జి అని కూడా పిలుస్తారు.[1]

జీవితం

[మార్చు]

శ్రీనివాస్ ది గుంటూరు. తండ్రి స్వంత లారీ నడిపేవాడు. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి గణితం పరీక్షలో మొదటి సారి ఉత్తీర్ణుడు కాలేక మళ్ళీ రాసి పాసయ్యాడు. కళాశాల చదువుకు వెళ్ళే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతని మీద పడింది. వాళ్ళ పక్కింట్లో ఉన్న రంగారావు అనే వ్యక్తి పత్తి విత్తనాల వ్యాపారం చేస్తుంటే అందులో సహాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అక్కడే ఐదారేళ్ళు పనిచేశాక తనే స్వంతంగా ఓ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ సంస్థ పనిచేస్తూనే ఉంది.

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇతనికి మేనమామ. వ్యాపార నిమిత్తం హైదరాబాదుకు వెళ్ళి ఆయన్ను కలిసినప్పుడు సినీ నిర్మాణంతో అనుబంధం కలిగింది. అలా 1997 లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అతను పనిచేసిన మొదటి సినిమా శ్రీహరి కథానాయకుడిగా నటించిన సాంబయ్య. హైదరాబాదులో శ్రీనివాస్, దర్శకులు వి. వి. వినాయక్, డాలీ, మిత్రుడు గోపిలతో కలిసి జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్ళు.

కెరీర్

[మార్చు]

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఆది సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. తరువాత బాలకృష్ణ హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. తరువాత కల్యాణ రాముడు, లక్ష్మీ సినిమాలు తీశాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇక సినిమాలు చాలనుకుని గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొద్ది రోజులుండి వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ స్నేహితుల సలహాతో మళ్ళీ సినీరంగం లోకి వచ్చాడు. గోపీచంద్ తో లక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. తరువాత డి. సురేష్ బాబు సహకారంతో చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నేను నా రాక్షసి సినిమాలు తీశాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు అవార్డులు వచ్చాయి కానీ ఆర్థికంగా పెద్దగా లాభాలు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రేసుగుర్రం తీశాడు. దీని తర్వాత ముకుంద సినిమా తీశాడు.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆ ఒక్క సినిమా చాలనుకున్నాను!. ఈనాడు గ్రూపు. 18 September 2016. p. 20.