సాఫ్ట్‌వేర్ సుధీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాఫ్ట్‌వేర్ సుధీర్
దర్శకత్వంరాజశేఖర్ రెడ్డి
నిర్మాతశేఖర్ రాజు
తారాగణంసుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, నాజర్, షాయాజీ, ఇంద్రజ, సంజయ్ స్వరూప్
ఛాయాగ్రహణంసి. రాం ప్రసాద్
సంగీతంభీమ్స్‌ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
సురేఖ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
28 డిసెంబరు 2019
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సాఫ్ట్‌వేర్ సుధీర్ 2019, డిసెంబరు 28న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు.[1][2][3]

కథా నేపథ్యం

[మార్చు]

అమాయ‌కుడైన చందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మాయిలను చూసి ప్రేమించాలనుకుంటాడు. చందు అమాయ‌క‌త్వాన్ని గ‌మ‌నించిన‌ స్వాతి (ధ‌న్య‌ బాల‌కృష్ణ‌) అతన్ని ప్రేమ‌లో ప‌డేస్తుంది. ఇరు కుటుంబాలు అంగీకారంతో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ త‌రువాత స్వాతి కుటుంబంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రగడంతో స్వాతి కుటుంబం ఓ స్వామీజీని క‌లుస్తారు. చందుని అడ్డుపెట్టుకుని అత‌ని తండ్రి ప‌నిచేస్తున్న మంత్రి ద‌గ్గ‌ర స్వామీ వెయ్యి కోట్లు కొట్టేస్తాడు. దాంతో చందూ కూడా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి
  • నిర్మాత: శేఖర్ రాజు
  • సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
  • ఛాయాగ్రహణం: సి. రాం ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: సురేఖ ఆర్ట్ క్రియేషన్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. సురేష్ ఉపాధ్యాయ, భీమ్స్‌ సిసిరోలియో, గద్దర్ పాటలు రాసారు. 2019, డిసెంబరు 25న హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సమక్షంలో పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఇంత అందమే"సురేష్ ఉపాధ్యాయభీమ్స్‌ సిసిరోలియో5:06
2."అయ్యయ్యో"భీమ్స్‌ సిసిరోలియోభీమ్స్‌ సిసిరోలియో, స్వాతిరెడ్డి4:56
3."మేలుకో రైతన్న"గద్దర్గద్దర్2:55
4."కోయంబత్తూరే"సురేష్ ఉపాధ్యాయరఘురాం, స్వాతిరెడ్డి3:59
5."యు ఆర్ మై ఐడెంటిటీ"సురేష్ ఉపాధ్యాయరఘురాం 

విడుదల - స్పందన

[మార్చు]

2019, డిసెంబరు 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు అందుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Software Sudheer". Times of India. 28 December 2019. Retrieved 4 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 4 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "I imitated both Rajinikanth and Pawan Kalyan in 'Software Sudheer': Sudigali Sudheer". Times of India. 8 November 2019. Retrieved 4 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సాఫ్ట్‌వేర్ సుధీర్