కిల్లర్ సూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిల్లర్ సూప్
జానర్బ్లాక్ కామెడీ

క్రైమ్

థ్రిల్లర్
సృష్టికర్తఅభిషేక్ చౌబే
రచయిత
  • అభిషేక్ చౌబే
  • యునైజా వ్యాపారి మర్చంట్
  • హర్షద్ నలవాడే
  • అనంత్ త్రిపాఠి
దర్శకత్వంఅభిషేక్ చౌబే
తారాగణం
దేశంభారతదేశం
అసలు భాషలుహిందీ, తమిళం
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్రవి తివారీ
ప్రొడ్యూసర్చేతనా కౌషిక్
హనీ ట్రెహాన్
ఛాయాగ్రహణంఅనుజ్ రాకేష్ ధావన్
ఎడిటర్లుసంయుక్త కాజా
మేఘన మంచాంద సేన్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
ప్రొడక్షన్ కంపెనీమాక్‌గఫిన్ పిక్చర్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్
వాస్తవ విడుదల11 జనవరి 2024 (2024-01-11)

కిల్లర్ సూప్ 2024లో హిందీలో విడుదలైన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్‌పై చేతనా కౌషిక్, హనీ ట్రెహాన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పేయ్, కొంకణా సేన్ శర్మ, సాయాజీ షిండే, నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ని జనవరి 3న విడుదల చేసి[1], వెబ్ సిరీస్‌ను జనవరి 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.[2][3]

ప్రభాకర్‌ శెట్టి(మనోజ్‌ భాజ్‌పాయి) తన భార్య స్వాతిని (కొంకణా శర్మ) భార్యాభర్తలు. స్వాతికి రెస్టారెంట్‌ పెట్టి తన వంట పాయా సూప్‌తో (ట్రాటర్‌ సూప్‌)తో అందరిని అంబురపరచాలనుకుంటుంది. ఈ విషయం భర్త ప్రభాకర్‌ చెప్పగా రెస్టారెంట్‌ తెరవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ప్రభాకర్‌కు ఉమేష్‌ పిళ్లైతో (మనోజ్‌ భాజ్‌పాయి ద్విపాత్రాభినయం) తన భార్య స్వాతి అక్రమ సంబంధం బయట పడుతుంది. ప్రభాకర్‌ తో పెళ్లికి ముందే ఉమేష్‌ను ప్రేమించిన స్వాతి పెళ్లి తర్వాత కూడా అతడితో సంబంధం కొనసాగిస్తుంది.

ఇది తెలిసిన ప్రభాకర్‌ భార్య స్వాతిని చంపాలనుకుంటాడు. కానీ, స్వాతి ఉమేష్‌తో కలిసి భర్త ప్రభాకర్‌ను చంపేస్తుంది. ఆ తర్వాత అచ్చం తన భర్త ప్రభాకర్‌ పోలికలతో ఉన్న ఉమేష్‌ను తన భర్తగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రభాకర్‌ హత్య బయట పడకుండ ఉమేషేని ప్రభాకర్‌ అని ప్రపంచాన్ని నమ్మించేందుకు స్వాతి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఎప్పుడూ ఏదోక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది. వాటిని దాటడానికి వారిద్దరు ఏం చేశారు ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • కొంకణా సేన్ శర్మ - స్వాతి శెట్టి
  • మనోజ్ బాజ్‌పేయ్ - (ద్విపాత్రాభినయం) స్వాతి భర్త ప్రభాకర్ "ప్రభు" శెట్టి & స్వాతి ప్రేమికుడు ఉమేష్ పిళ్లై
  • నాజర్ - ఇన్‌స్పెక్టర్ హసన్‌
  • సాయాజీ షిండే - అరవింద్ శెట్టి, ప్రభాకర్ అన్నయ్య
  • అనులా నవ్లేకర్ - అపేక్ష "అప్పు" శెట్టి, అరవింద్ కుమార్తె & ప్రభు మేనకోడలు
  • లాల్ - చార్లెస్ లూకాస్‌
  • రాజీవ్ రవీంద్రనాథన్ - డీఎస్పీ ఉదయారెడ్డి
  • కని కుశృతి - కీర్తిమ కడతనాథన్‌
  • శిల్పా ముద్బి - హెడ్ ​​కానిస్టేబుల్ ఆశా రీతు
  • అన్బుథాసన్ - ఏఎస్‌ఐ తుపల్లి
  • వైశాలి బిష్త్ - ఖాన్సామా
  • మల్లికా ప్రసాద్ సిన్హా - జుబేదా
  • భగవతి పెరుమాళ్ - ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ నాడార్
  • రాజా PRS - పోలీస్ కానిస్టేబుల్ బిన్నీ

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (3 January 2024). "మనోజ్ బాజ్ పేయి 'కిల్లర్ సూప్' ట్రైలర్ - ఇదో డార్క్ క్రైమ్ స్టోరీ". telugu.abplive.com. Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  2. TV9 Telugu (3 January 2024). "ఉత్కంఠగా 'కిల్లర్‌ సూప్‌' వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (14 December 2023). "'Killer Soup', starring Manoj Bajpayee and Konkona Sensharma, gets premiere date" (in Indian English). Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
  4. Eenadu (13 January 2024). "రివ్యూ: కిల్లర్‌ సూప్‌.. మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.

బయటి లింకులు

[మార్చు]