Jump to content

అవంతిక (2017 సినిమా)

వికీపీడియా నుండి
అవంతిక
అవంతిక సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీరాజ్ బళ్ళ
రచనశ్రీరాజ్ బళ్ళ
క్రాంతి సైనా (మాటలు)
నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ
తారాగణంపూర్ణ
షాయాజీ షిండే
శ్రీరాజ్ బళ్ళ
అజయ్ ఘోష్
గీతాంజలి
ఛాయాగ్రహణంకర్ణ ప్యారసాని
రమేష్ పోలేపల్లి
కూర్పుశివ వై ప్రసాద్
సోమేశ్వర్ పోచం
సతీష్ రామిడి
సంగీతంరవిరాజ్ బళ్ళ
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
2017, జూన్ 16
సినిమా నిడివి
114 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

అవంతిక 2017, జూన్ 16న విడుదలైన తెలుగు సినిమా.[1][2] భీమవరం టాకీస్ బ్యానరులో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించాడు.[3][4] ఇందులో పూర్ణ, షాయాజీ షిండే, శ్రీరాజ్ బళ్ళ, అజయ్ ఘోష్, గీతాంజలి తదితరులు నటించగా, రవిరాజ్ బళ్ళ సంగీతం అందించాడు.[5][6]

కథా సారాశం

[మార్చు]

అవంతిక (పూర్ణ) అమాయక గ్రామీణ అమ్మాయి. తన జీవితం గురించి కలలు కటుంటుంది. రాజకీయ నాయకుడు (అజయ్ ఘోష్) తన సొంత ప్రయోజనం కోసం, డబ్బు సంపాదించడం కోసం బాబా (షాయాజీ షిండే) సహాయంతో ఒక ఇంటిలో అవంతికను బలి ఇస్తాడు. కొంతకాలం తరువాత శ్రీను (శ్రీరాజ్) అనే వ్యక్తి అదే ఇంటిలోకి వస్తాడు. అక్కడ శ్రీను ఏ పరిస్థితులను ఎదుర్కొంటాడు? ఆ ఇంటిలో అవంతిక ఉనికి గురించి శ్రీను ఎప్పుడు తెలుసుకుంటాడు? దుష్ట ఆత్మ ఉందా? అనేది మిగతా కథ.[7][8]

నటవర్గం

[మార్చు]

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • సహ దర్శకుడు: గిరిధర్ పస్తుల
  • సహాయ దర్శకులు: దర్శన్, ప్రణయ్‌రాజ్ వంగరి, శివ, అకోశ చక్రం
  • దుస్తులు: తిరుమల
  • మేకప్: సన్నీ-మయూర్
  • కళ: పరమేష్, శివాజీ
  • విఎఫెక్స్: చందు ఆది
  • రీ-రికార్డింగ్: ప్రద్యోతన్
  • డిఐ: రత్నాకర్
  • 5.1: రమేష్
  • సౌండ్ డిజైన్: శేషు కె.ఎం.ఆర్.
  • పి.ఆర్.ఓ.: ధీరజ్ అప్పాజీ
  • పబ్లిసిటీ డిజైన్: వెంకట్ బుజ్జి

పాటలు

[మార్చు]
సినిమా ముహూర్త కార్యక్రమంలో క్లాప్ ఇస్తున్న సినీ దర్శకుడు దాసరి నారాయణరావు
సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో అవంతిక చిత్ర బృందం

ఈ సినిమాకు రవిరాజ్ బళ్ళ సంగీతం అందించాడు.[9] భారతిబాబు, శ్రీరామ్ పాటలు రాసారు.

  1. నాలోన నీవే
  2. కొండగట్టు
  3. అవంతిక టైటిల్ సాంగ్

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Avanthika (2017) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-06-04.
  2. "Avantika (2017)". Indiancine.ma. Retrieved 2021-06-04.
  3. "Avanthika 2017 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Avantika - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
  5. "Avanthika telugu movie review | Avanthika Telugu Movie Review and Rating". 123telugu.com (in ఇంగ్లీష్). 2017-06-16. Retrieved 2021-06-04.
  6. "Avanthika 2017 Telugu Movie Cast Crew". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "Avanthika Movie Review (2017) - Rating, Cast & Crew With Synopsis". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
  8. "Avanthika Review Rating Public Response – Avantika Telugu Movie Live Updates Story". All India Roundup (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-17. Retrieved 2021-06-04.
  9. admin (2021-05-06). "Avanthika 2017 Telugu Mp3 Naa Songs Free Download" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-04.

ఇతర లంకెలు

[మార్చు]